పవన్ సంచలనం… దెబ్బకు ఫ్యూజులు గల్లంతు!

కొన్నిరోజుల నుంచి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు పవన్ కళ్యాణ్‌పై సరికొత్త పల్లవిని ఎత్తుకున్నారు. నాన్ లోకల్ అయిన పవన్… గాజువాకలో గెలిస్తే ఏమాత్రం పట్టించుకోడని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ స్థానికుడు కాదని, ఏదైనా అవసరం వస్తే హైదరాబాద్ వెళ్ళి అడుగుతారా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. గెలిచాక పవన్ పత్తా లేకుండా పోతాడని, అతనిని గెలిపిస్తే మీరే నష్టపోతారంటూ పవన్ స్థానికతపై ప్రత్యర్థులు గాజువాకలో పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టి నానాయాగీ చేస్తున్నారు.

స్థానికతపై ప్రత్యర్థుల ఆరోపణలు మరీ పెచ్చుమీరిపోతుండడంతో… పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి తన మకాంను గాజువాకకు మార్చాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకు చినగంట్యాడ శ్రీకృష్ణ దేవరాయ నగర్‌లో పవన్ తన స్థిర నివాసం కోసం డూప్లెక్స్ గృహాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎటువంటి భద్రత ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆ నివాసాన్ని కొన్ని ఏళ్లకు అద్దెకు తీసుకున్నారు. గాజువాకను సొంత నియోజకవర్గంగా మార్చుకుంటానని, అందుకే తాను ఇక్కడే ఇల్లు తీసుకున్నానని పవన్ ప్రకటించారు. దీంతో ప్రత్యర్థులకు కోలుకోలేని కౌంటర్ ఇచ్చినట్టయ్యింది.