పద్దతి మార్చుకున్న విజయ్ దేవరకొండ.. అసలు రీజన్ ఇదేనా..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని,తాజాగా రిలీజ్ అయిన టీజర్‌తో అదిరిపోయే హైప్ క్రియేట్ చేసింది.ఈ సినిమాలో విజయ్ ఒక్కరితో కాకుండా ఏకంగా నలుగురు బ్యూటీలతో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కోసం విజయ్ తన పేరును మార్చుకున్న సంగతి చాలా తక్కువ మంది గమనించి ఉంటారు.

 

విజయ్ గత సినిమాలలో తన పేరును విజయ్ దేవరకొండగా చూపించేవాడు.కానీ ఈ సినిమాలో అతడి పేరును దేవరకొండ విజయ్ సాయిగా చూపించాడు.విజయ్ తన కెరీర్ మొదలు నుండి గీత గోవిందం వరకు విజయ్ దేవరకొండగా తన పేరును చూపించాడు.మరి ఈ సినిమాలో తన పేరును ఎందుకు అలా మార్చాడు అనే విషయానికి సంబంధించిన ఇండస్ట్రీలో పలు చర్చలు జరుగుతున్నాయి.విజయ్‌ దేవరకొండ న్యూమరాలజీ ప్రకారం తన పేరును ఇలా స్వల్పంగా మార్చి ఉంటాడని పలువురు అంటుండగా, అదృష్టం కలిసి రావడానికే మనోడు ఇలా చేశాడంటూ మరికొందరు అంటున్నారు.కాగా గీత గోవిందం సినిమా తరువాత విజయ్‌కు అనుకున్న స్థాయిలో సక్సెస్ దక్కలేదు.మరి ఈ పేరు మార్పుతోనైనా మనోడికి అదిరిపోయే సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.కాగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.