ఒక్క హిట్ స్టార్ దర్శకుడి కాళ్ళ దగ్గరికి అన్ని వస్తాయ్…

దర్శకుడిగా ఎదగాలంటే ప్రేక్షకుల నాడి తెలిసుకుని సినిమా తీసే సత్తా ఉండాలి. అటువంటి టెక్నిక్ తెలిసిన డైరక్టర్లలో బోయపాటి శ్రీను కూడా ఉంటాడు. యాక్షన్, సెంటిమెంట్ ను కలగలిపి ప్రేక్షకులకు నచ్చేలా తీయడంలో బోయపాటి స్పెషలిస్ట్. తొలి చిత్రం భద్రతోనే సూపర్ హిట్ కొట్టిన బోయపాటి మాస్ ఇమేజ్ కావాలనుకునే హీరోలకు వన్ ఆఫ్ ది ఛాయిస్ గా మారాడు. తొలి నుంచీ మాస్ కంటెంట్ ఉన్న సినిమాలనే తెరకెక్కిస్తూ రాణిస్తున్న బోయపాటి శ్రీను పుట్టినరోజు నేడు.

భద్ర తర్వాత తీసిన తులసితో వెంకటేశ్ ను లో మాస్ ఇమేజ్ తో చూపించాడు. బాలకృష్ణతో చేసిన సింహ ఓ వండర్ అనే చెప్పాలి. అప్పటికి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు బాలకృష్ణ. బాలయ్యను సరైన పద్ధతిలో సినిమా చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించాడు బోయపాటి. బాలయ్య క్యారెక్టర్ ను సాఫ్ట్ అండ్ మాస్ రోల్స్ లో చక్కగా డిజైన్ చేశాడు. బాలయ్య డైలాగ్ డిక్షన్ ను, ఫైట్స్ లో స్టైల్ ను మార్చేసి బ్లాక్ బస్టర్ అందించాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమాలన్నింటిలో స్పష్టమైన మార్పు కనిపించడానికి కారణం బోయపాటి శ్రీను అనేది నిర్వివాదాంశం.సరైనోడు సినిమాలో కథ, కథనాన్ని బలంగా చూపించి బన్నీకి 100కోట్ల గ్రాస్ ను రుచి చూపించాడు.దమ్ము సినిమా చూస్తే చాలా పట్టున్న కథే.

కథనంలో లోపం వల్ల ఫ్లాప్ ఎదురైంది. ఎవరికైనా హిట్లు, ఫ్లాపులు అనేవి కామన్ విషయం. జయ జానకీ నాయకి, వినయ విధేయ రామ వంటి ఫ్లాపులు ఎదురైనా ఇండస్ట్రీకి అతనిపై గురి ఉంది. బోయపాటిపై ఉన్న నమ్మకమే బాలయ్య మళ్లీ అతనితో సినిమా చేసేలా చేస్తోంది. ఈ సినిమాతో మళ్లీ తన టేకింగ్ మాయాజాలం చూపిస్తే బోయపాటికి మంచి రోజులే.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.