వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ బంపర్ ఆఫర్..14వేల బిగ్ డిస్కౌంట్

కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసేవారికి తీపికబురు. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కళ్లుచెదిరే ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది.కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 6టీ (8 జీబీ ర్యామ్+ 128 జీబీ మెమరీ) స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ ఉంటుంది. కంపెనీ 2018 అక్టోబర్ నెలలో ఈ ఫోన్‌ను దేశీ మార్కెట్‌లో లాంచ్ చేసింది. అప్పుడు దీని ధర రూ.37,999. 6 జీబీ ర్యామ్+ 128 జీబీ మెమరీకి ఇది వర్తిస్తుంది. అదే 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ ధర రూ.41,999. ఇప్పుడు ఈ మోడల్ ధర రూ.27,999. కస్టమర్లు ఫోన్ కొనుగోలుపై అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,750 తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6.41 అంగుళాల ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, డ్యూయెల్ రియర్ కెమెరా (16 ఎంపీ+20 ఎంపీ), 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.