ఒక కప్పు టీ 13 వేలా..? ఎక్కడో తెలిస్తే షాకే..?

తేనీటిని కనిపెట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజలందరూ ఉదయం పూట టీ తాగుతున్నారు. తలనొప్పి వస్తే చాలు.. ఉపశమనానికి ఓ కప్పు టీ తాగేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఎదురుగా వుండే ఓ స్టార్ హోటల్‌లో ఒక కప్పు టీ ధర.. భారత కరెన్సీ ప్రకారం రూ.13.800లకు అమ్మబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. అదే బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఎదురుగా వున్న ది రూబెన్స్ అనే హోటల్‌లో రెండు వందల రూపాయలకే చౌక ధరలోనూ టీ అమ్మబడుతుందట.

ఇంకా ఈ టీ భారీ ధరకు విక్రయించేందుకు కారణం లేకపోలేదు. టీపొడి తయారీకి ముందుగానే.. తేయాకులను అత్యంత విలువైన వెల్వెట్ దుస్తుల్లో ఎండబెడుతున్నారని.. ఆపైనే టీ పొడిలా తయారవుతున్నాయని.. అలా ఆ హోటల్‌కు వచ్చే టీ పొడికే రేటు ఎక్కువని తెలిసింది. ఇంకా ఈ టీ వెండి కప్పుల్లో అందించడం జరుగుతోంది. ఇలా భారీ రేటుకు కప్పు టీని అమ్మినా.. ఆ టీని తాగేందుకు ప్రజలు ఎగబడుతూనే వున్నారట. అదన్నమాట సంగతి.