చిన్న వయస్సులోనే డైలాగ్ తో ఉపేసిన ఏన్టీఆర్…

నందమూరి ఫ్యామిలీ నుంచి ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూసేది సినిమాలో ఉండే డైలాగుల కోసం, ఎన్టీఆర్ సినిమా వచ్చినా, బాలకృష్ణ సినిమా వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినా సరే… వారి సినిమాల్లో ఎక్కువగా డైలాగులకు ప్రాధాన్యత ఇస్తారు దర్శక నిర్మాతలు. ఆ సినిమాలకు ఆ విధంగా పాపులారిటి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే అతను చేసిన సినిమాలు తక్కువే అయినా కొన్ని సినిమాల్లో అతను చెప్పిన డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి. యమ దొంగ సినిమాలో ఆయన నోటి నుంచి వచ్చిన డైలాగ్ ఇప్పటికి వినపడుతూనే ఉంటుంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఉండే కొన్ని డైలాగులతో పాటుగా.. సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. ఆది సినిమాలో సౌండ్ చేయకు కంఠం కోసేస్తా అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఇప్పటి వరకు ప్రేక్షకులకు వినపడుతూనే ఉంది. అలాగే ఆయన నటించిన జనతా గ్యారేజ్ తో పాటుగా ఇటీవల వచ్చిన అరవింద సమేత సినిమాలో ఉండే డైలాగులు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఇక అశోక్ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ సినిమాలో నీ కొడుకులు నన్ను తట్టుకోవడం కష్టం అమ్మా అంటూ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తారు.అదే విధంగా మరికొన్ని డైలాగులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో హైలెట్ అవుతూ వచ్చాయి.

ఇక అతని నటన కూడా అదే స్థాయి లో పాపులర్ అయింది. 20 ఏళ్ళు కూడా రాకుండానే అతను చెప్పిన డైలాగులు బాగా ఫేమస్ అయ్యాయి. టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు తారక్. టెంపర్ సినిమాలో కూడా డైలాగులు బాగా నచ్చాయి ప్రేక్షకులకు.