ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసిరిన ప్రముఖ యాంకర్..

తెలుగు బుల్లితెర సూపర్ స్టార్ సుమ..తాజాగా జూ. ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసిరింది..ఛాలెంజ్ అంటే అదేదో అనుకోకండి..గ్రీన్ ఛాలెంజ్ ను విసిరింది. తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో ఆ తర్వాత సినీ , రాజకీయ , క్రీడా ఇలా అందరు ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ మరొకరికి విసురుతున్నారు.

తాజాగా సినీ సీనియర్ నటి జయసుధ..యాంకర్ సుమ కు ఈ ఛాలెంజ్ విసరగా..ఆమె స్వీకరించారు. ఇవాళ మూడు మొక్కలు నాటారు. అనంతరం సుమ.. జూనియర్‌ ఎన్టీఆర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మంచు లక్ష్మీ, యాంకర్‌ ఓంకార్‌కు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌కు సుమ కృతజ్ఞతలు తెలిపారు.