నివేదా రోల్ ఇదేనా..? అల.. వైకుంఠపురములో.. త్రివిక్రం మార్క్

‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ ఈ మధ్యనే ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది.తాజాగా ఈమె అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ ముఖ్య పాత్ర పోషిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ…. తన పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. ఈ సినిమాలో తానొక గ్లామరస్ పాత్ర లో కనిపించబోతోందట. ఇప్పటిదాకా తెలుగు, తమిళంలో చేసిన అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తన పాత్ర చాలా గ్లామరస్ గా ఉంటుందని చెప్పుకొస్తోంది ఈ భామ.

అంతేకాకుండా తెరపైన గ్లామరస్ గా కనిపించడానికి తాను వ్యతిరేకం కాదని, అందులో ఎలాంటి తప్పు లేదని, కథ మరియు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామరస్ పాత్రలు పోషించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెబుతోంది నివేదా పేతురాజ్.పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న టబు ఈ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.