నిధి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..? గల్లా అశోక్ సినిమాకి అంత తీసుకుంటుందా..?

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ మూవీ నిన్న అధికారికంగా లాంచ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే గల్లా అశోక్‌కి ఇది మొదటి చిత్రమే అయినా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తుంది.అయితే సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరచయం అయిన నిధి అగర్వాల్ చిన్న చిన్న హీరోలతో నటించి నటనలో మంచి పేరు తెచ్చుకున్నా పెద్దగా హిట్ కొట్టలేకపోయింది.

అయితే ఇటీవల రామ్ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ కొట్టడంతో నిధి అగర్వాల్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కొడితే చాలు నటినటులు యొక్క రెమ్యునరేషన్ కూడా ఇట్టే మారిపోతుంది. అయితే గల్లా అశోక్ సినిమాలో నిధి నటించడానికి దాదాపుగా కోటి రూపాయలకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని సినీ వర్గాల నుంచి అందిన సమాచారం. ఏదేమైనా ఇస్మార్ట్ శంకర్ హిట్‌తో నిధి క్రేజే పెరిగిపోయింది.