రంగ్ దే నుండీ న్యూ అప్డేట్… మళయాళ సినిమా రిమేకా…?

యువ హీరో నితిన్ భీష్మ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. వెంకీ కుడుములు డైరక్షన్ లో వచ్చిన భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నితిన్. రష్మిక హీరోయిన్ గా నటించినా ఆ సినిమా నితిన్ కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్, కీర్తి సురేష్ ల జోడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.

ఈ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా మళయాళ మూవీ రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చార్లీ సినిమా రీమేక్ గా రంగ్ దే సినిమా వస్తుందని అంటున్నారు. తొలి సినిమా తొలిప్రేమతో హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ అట్లూరి రెండో మూవీ మిస్టర్ మజ్ను ఫ్లాప్ అందుకున్నాడు. అందుకే మలయాళ సినిమా రీమేక్ చేస్తున్నాడని అంటున్నారు.2015లో వచ్చిన చార్లీ సినిమా మార్టిన్ ప్రక్కట్ డైరెక్ట్ చేశారు. సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా పార్వతి, అపర్ణ గోపినాథ్ నటించారు.

అయితే రంగ్ దే లో కేవలం కీర్తి సురేష్ మాత్రమే హీరోయిన్ గా నటిస్తుంది. వేరే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరి నిజంగానే రంగ్ దే దుల్కర్ సినిమా రీమేకా కాదా అన్నది కూడా కొద్దిరోజుల్లో క్లారిటీ వస్తుంది. ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో చదరంగం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.