నేనిలా అవ్వడానికి హైపర్ ఆది నే కారణం.. సంచలన విషయాలు బయటపెట్టిన శాంతి స్వరూప్

ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ‘జబర్ధస్’ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో లేడీ గెటప్‌లు వేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎప్పుడూ అదే గెటప్‌లో కనిపిస్తూ కామెడీని పంచుతుంటాడు శాంతి స్వరూప్. ఈయన ప్రతీ స్కిట్టులో కనిపించి సందడి చేస్తుంటాడు. అలాంటి శాంతి స్వరూప్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

ఇంటర్వ్యూలో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాడు శాంతి స్వరూప్. ‘‘ఆదితో స్కిట్ చేస్తే అతడు నాపై పంచులు వేస్తుంటాడు. వాటి వల్ల నాకు బాధ అనిపించదు. పైగా, వాటి వల్లే నాకు మంచి పేరు వచ్చింది. ఆయన పంచులు వేసినా అవి షో వరకే అని అందరూ గుర్తించాలి. చాలా మంది ఇదే విషయమై నన్ను అడుగుతూనే ఉంటారు. వాళ్లందరికీ ఇదే నా సమాధానం” అంటూ చెప్పుకొచ్చాడు ఈ జబర్ధస్త్ కమెడియన్.ఎప్పుడు లేడీ గెటప్పులే వేస్తారెందుకు అని అడిగిన ప్రశ్నకు ‘‘లేడీ గెటప్స్ వేయడం వల్ల మాకు లాభనష్టాలు రెండూ ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు నా పాత్ర బాగుంటుందని, ‘జబర్దస్త్’లో ఎంట్రీ సాంగ్‌తో నా ప్రవేశం బాగుందని చాలా మంది చెబుతారు. అప్పుడు ఆనందంగా ఉంటుంది. అయితే, కొందరు మాత్రం ఎప్పుడూ తమ మాటలతో ఇబ్బంది పెడుతుంటారు” అని శాంతి స్వరూప్ తెలిపాడు.

ప్రస్తుతం అతడు చేస్తున్న కామెడీ షో గురించి చెబుతూ ‘‘సినిమా అవకాశాల కోసం ఊరి నుంచి వచ్చేసిన నాకు ‘జబర్ధస్’ ద్వారా మంచి అవకాశం వచ్చింది. ఈ షో చేయడం వల్ల నేను అందరికీ తెలిసిపోయాను. ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తుపట్టడం.. సెల్ఫీలు కావాలని అడగడం చేస్తున్నారు. నేను మాత్రమే కాదు.. నాలాంటి ఎంతో మందికి ఈ షో అన్నం పెడుతోంది” అని చెప్పుకొచ్చాడు.