షాకింగ్.. నయనతార పెళ్ళి వాయిదా..! అసలు కారణం ఇదే..?

సౌత్‌ క్వీన్‌గా వెలుగొందుతోన్న నయనతార పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చిందనుకున్నారంతా. గత కొన్నాళ్లుగా నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు ప్రేమ, పెళ్లి అంటూ ధగా పడిన నయనతార ఈ సారి ఇక పెళ్లి జోలికి పోలేదు. ప్రియుడితో సహజీవనం చేస్తూ, ఫుల్‌గా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ వచ్చింది. కానీ, సొసైటీలో బతకాలంటే పెళ్లి తప్పని సరి అని గుర్తించిందో ఏమో, ఈ మధ్యనే నయనతార పెళ్లి వార్త మళ్లీ తెరపైకి వచ్చింది.

డిశంబర్‌లో నయన్‌ పెళ్లి చేసుకోబోతోందంటూ నెట్టింట్లో న్యూస్‌ స్వైర విహారం చేసింది. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మరోసారి నయన్‌ పెళ్లి వాయిదా పడిందని తెలుస్తోంది. అందుకు కారణం ఆమె బిజీ షెడ్యూల్సే అని తెలుస్తోంది. ఇటీవలే నయనతార విజయ్‌తో ‘బిగిల్‌’ సినిమాలో నటించింది. తర్వాత ఈ సంక్రాంతికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ‘దర్బార్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ నిర్మాణంలో ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో నటిస్తోంది. ఇవన్నీ కాక, మరో రెండు కొత్త ప్రాజెక్టులపై నయన్‌ సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇవి కూడా ప్రెస్జీజియస్‌ ప్రాజెక్టులే కావడంతో,

తన పెళ్లిని మరి కొద్ది నెలలు పోస్ట్‌ పోన్‌ చేసుకుందామనే ఆలోచనలో నయన్‌ ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ కోలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. అలా పాపం నయన్‌కి ఈ మూడో ప్రేమ కూడా పెళ్లి పీటలెక్కేందుకు చాలా కష్టపడుతున్నట్లుంది. అయితేనేం, సౌత్‌లో నయన్‌కి కొట్టేవాళ్లే లేరు. వన్‌ అండ్‌ ఓన్లీ టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌ నయన్‌.