నవదీప్ మాంచి క్లారీటి మెయింటేన్ చేస్తున్నాడుగా….

తెలుగుతెరకు హీరోగా పరిచయమయిన నవదీప్ మొదట్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ సరైన గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోయాడు. విభిన్నమైన పాత్రల్లో నటించినప్పటికీ అవి సరైన విజయాన్ని అందించలేకపోయాయి . ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ… హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు నవదీప్. దీంతో చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్ సాగుతూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం వరస అవకాశాలు దక్కించుకుంటున్నాడు ఈ యువ నటుడు.

అటు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరై తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. గత కొంతకాలం క్రితం వరకూ తన కెరీర్ పట్ల తాను ఎంతగానో అసంతృప్తి గా ఫీల్ అయ్యేవాడిని కానీ ఇటీవలి కాలంలో తన కెరియర్ గ్రాఫ్ ఆశాజనకంగానే ఉంది అంటూ నవదీప్ తెలిపాడు. ప్రస్తుతం ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి తన సత్తా చాటడంతో పాటు తెలుగులో మోసగాళ్లు అనే సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో విలన్ గా తాను చేసిన పాత్ర తనకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుంది అని నమ్మకం తనకు ఉందని తెలిపాడు.అంతే కాకుండా మరో రెండు తెలుగు సినిమాలకు కూడా తాను సైన్ చేశానని తెలిపాడు. మరోవైపు ఒక తమిళ సినిమాను కూడా ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

అయితే తను మంచి మంచి అవకాశాలు అనే అందుకుంటున్నానని… ఈ సమయంలో తన కెరీర్ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాను ఎక్కడికి వెళ్లినా పెళ్లెప్పుడు అనే ప్రశ్న అడుగుతున్నారు అని చెప్పిన నవదీప్ ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని.. ఫైనాన్షియల్ గా బాగా నిలదొక్కుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మధ్యకాలంలో నవదీప్ ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్న విషయం తెలిసిందే.