నానికి బిగ్ షాక్.. 30 కోట్లు రాబట్టగలదా..?

నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా నిన్న విడుదలైంది. మార్నింగ్ షో నుండే సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. నాని నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి సినిమాను నాని అందించాడు. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. గ్యాంగ్ లీడర్ కు పోటీనిచ్చే సినిమా కూడా లేకపోవటంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయని సమాచారం.కానీ నిన్న విడుదలైన ఈ సినిమాకు పైరసీ షాక్ తగిలింది. గ్యాంగ్ లీడర్ సినిమా పైరేటెడ్ ప్రింట్ నిన్న సాయంత్రం నుండి ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకు పైరసీ కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే అని చెప్పవచ్చు.

గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మాతలు పైరేటెడ్ వెబ్ సైట్లపై తగిన చర్యలు తీసుకుంటే సినిమాకు మేలు జరిగే అవకాశం ఉంది. గ్యాంగ్ లీడర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.మొదటిరోజు ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే వచ్చాయని తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని, కార్తికేయ నటన ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వెన్నెల కిషోర్ కనిపించేది తక్కువ సీన్లలోనే అయినప్పటికీ కడుపుబ్బా నవ్వించాడు. హీరోయిన్ ప్రియాంక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా నటనతో మెప్పించింది. అనిరుధ్ సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు.దర్శకుడు విక్రమ్ కె కుమార్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. సినిమా ఆరంభం నుండి చివరిదాకా కథానుసారం వచ్చే ట్విస్టులు బాగున్నాయి. కార్తికేయ విలన్ పాత్ర చేసింది తొలిసారే అయినా తన నటనతో మెప్పిస్తాడు. సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ పాజిటివ్ పాయింట్లు ఆ లోపాల్ని కవర్ చేసాయి. గ్యాంగ్ లీడర్ సినిమాతో నాని కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే అని చెప్పవచ్చు.