గ్యాంగ్ లీడర్ 2 డేస్ కలెక్షన్స్.. నాని నిలబడ్డాడా..?

శుక్ర‌వారం విడుద‌లైన చిత్రం గ్యాంగ్ లీడర్‌. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కుడు. తొలి రోజు 4.5 కోట్లు తెచ్చుకుంది నానీ సినిమా. టాక్ డివైడ్‌టా ఉండ‌డంతో గ్యాంగ్ లీడ‌ర్ వ‌సూళ్లు రెండో రోజు డ్రాప్ అవుతాయ‌నుకున్నారు. కానీ.. రెండో రోజు గ్యాంగ్ లీడ‌ర్ నిల‌బ‌డ‌గ‌లిగింది. దాదాపు 3.5 కోట్లు సాధించింది. అంటే రెండు రోజుల‌కు 8 కోట్లు వ‌చ్చేశాయ‌న్న‌మాట‌.

నైజాంలో 1.48 కోట్లు, సీడెడ్‌లో 47 ల‌క్షలు, విశాఖ‌లో 49 లక్ష‌లు తెచ్చుకుంది. గుంటూరు, ఈస్ట్‌, వెస్ట్‌, కృష్ణా, నెల్లూరుల‌లో `గ్యాంగ్ లీడ‌ర్` హ‌వా కాస్త త‌గ్గింది.కాక‌పోతే ఈ డివైడ్ టాక్‌లోనూ ఈ స్థాయిలో వ‌సూళ్లు తెచ్చుకోవ‌డం మామూలు విష‌యం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ ఈ సినిమా 22 కోట్ల‌కు అమ్మారు. ఆ మొత్తం రావ‌డం మాత్రం కాస్త క‌ష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే వ‌చ్చే వారం వాల్మీకి వ‌చ్చేస్తోంది. ఈలోగా గ్యాంగ్ లీడ‌ర్ 14 కోట్లు తెచ్చుకోవ‌డం దాదాపు క‌ష్ట‌మే.