నందమూరి ఫ్యాన్స్ కి పండగే.. మరోకసారి కలుస్తున్నారుగా..

ఎంత కాదన్నా బాబయ్ బాలయ్య, అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల మధ్య వుండాల్సిన అనుబంధం అలానే వుంది. గతంలో ఒకే వేదికపైకి ఈ ముగ్గురు వచ్చిన సందర్భాలు వున్నాయి. అయితే ఇటీవల మాత్రం ఈ ముగ్గురి కలయిక మీడియా కెమేరాలకు చిక్కలేదు. అలాంటి అవకాశం వస్తుందనే టాక్ ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచి వాడవురా’ మూవీ ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 8న జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఓ అతిథిగా హాజరు కాబోతుతున్నారు. మరి బాలయ్య బాబాయ్ కూడా వస్తారా? అన్నది చిన్న అనుమానం.

ఈ సినిమా నిర్మాణ భాగస్వామి శివలెంక కృష్ణప్రసాద్ కు బాలయ్యతో మాంచి అనుబంధం వుంది. బాలయ్యతో ఆయన సినిమాలు నిర్మించారు. ఆ అనుబంధంతో ఫంక్షన్ కు బాలయ్య ను కూడా పిలిస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచనలు సాగుతున్నాయి. అయితే అలా పిలవాలి అంటే కళ్యాణ్ రామ్ వైపు నుంచి కూడా పిలుపు వెళ్లాలేమో?

అసలే బాలయ్యతో వ్యవహారం చాలా సున్నితంగా వుంటుంది. అందువల్ల ఈ ఆహ్వానం కూడా అంత సున్నితంగా ప్లాన్ గా వుండాలి. అవే డిస్కషన్లు ఇప్పుడు నడుస్తున్నాయి. అవి సెటిల్ అయితే, ఒకే వేదిక మీదకు మళ్లీ బాబాయ్ అబ్బాయిలు వస్తారు.