RRR ఎఫెక్ట్.. నందమూరి అభిమానులకు బిగ్ షాక్

దర్శకధీరుడు రాజమౌళి – జూనియర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘RRR’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో పాటు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఇందులో నటిస్తున్న హీరోలు రామ్ చరణ్, తారక్ ఒకరి తర్వాత ఒకరు గాయపడడం, రాజమౌళి తన వ్యక్తిగత విషయాల కోసం విశ్రాంతి తీసుకోవడం వంటి వాటితో షూటింగ్‌కు బ్రేక్ పడుతూ వస్తోంది. అలాగే, మిగిలిన నటుల డేట్స్ సర్ధుబాటు కాకపోవడం వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్‌కు జంటగా నటించే హీరోయిన్ గురించి క్లారిటీ రావడం లేదు. మొదట తారక్‌కు జోడీగా హాలీవుడ్ అమ్మాయి డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తుందని చిత్ర యూనిట్ మొదట్లో ప్రకటించింది. అయితే, ఆమె సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఇందులో అతడికి జంటగా నిత్యామీనన్ నటిస్తుందని అన్నారు. ఆ తర్వాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్‌ను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ‘వైల్డ్ లైఫ్’, ‘నెర్వ్’, ‘వలంటైన్స్ డే’, ‘అడల్ట్ వరల్డ్’ సహా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమెతో రాజమౌళి సంప్రదింపులు జరిపారని వార్తలు కూడా వచ్చాయి.RRR షూటింగ్ ప్రారంభమై సోమవారంతో ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఆశించిన అప్‌డేట్స్ మాత్రం రావడం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్కో, ఎన్టీఆర్ గెటప్ పోస్టర్లో విడుదలవుతాయని గతంలో వార్తలు రావడంతో వారి ఫ్యాన్స్‌లో ఆశలు రేకెత్తాయి. కానీ, ఇప్పటి వరకు అలాంటివి రాలేదు. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.తమ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలనుకుంటున్న ‘RRR’ టీమ్.. ముందుగా ఎన్టీఆర్ రోల్‌కు సంబంధించిన లుక్ రివీల్ చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

ఇందులో భాగంగానే కొమరం భీంగా కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్ లుక్‌ను అక్టోబర్ 22న విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీనికి భిన్నంగా జరగడంతో అందరూ ఫీలై పోయారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది ఫిలిం నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ గెటప్‌నే ముందుగా విడుదల చేస్తారట. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజులుగా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దీంతో అందరూ ఎన్టీఆర్ లుక్కే ఫస్ట్ వస్తుందనుకున్నారు. కానీ, రాజమౌళి దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నాడని టాక్.