నమ్రతకు తెలీయకుండానే జరుగుతాయా..? మహేష్ సీక్రేట్ బట్టబయలు

సూపర్ స్టార్ మహేష్ కథల ఎంపికలో నమ్రత హస్తం ఉంటుందా? అంటే అవును తన పాత్ర లేనిదే ఇంకేదీ లేదని భావిస్తారు ఫ్యాన్స్. మీడియా సహా ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇదే టాక్ వినిపిస్తుంటుంది. మహేష్ స్టైలింగ్ నుంచి కథల ఎంపికల వరకూ ప్రతిదీ నమ్రతనే దగ్గరుండి మరీ చూసుకుంటారు. ప్రస్తుతం ఏఎంబీ సినిమాస్ బిజినెస్ సహా ఎంబీ ప్రొడక్షన్స్ వ్యవహారాలు నమ్రతనే చక్కదిద్దుతోంది. మహేష్ వాణిజ్య ప్రకటనల కోసం ముంబైలో నమ్రతనే పీఆర్ వోగా పని చేస్తుందని చెబుతుంటారు. మహేష్ కి ఎందులోనూ ఒత్తిడి లేకుండా చూడడం తన బాధ్యత అని చెబుతారు.అయితే ఇదంతా నిజమేనా? అంటే అవుననే చెప్పొచ్చు.

మహేష్ కి సంబంధించిన ఏ ఒత్తిడిని అయినా నమ్రత భరిస్తుంటారు. ఒకే ఒక్కటి తప్ప. మహేష్ కి సంబంధించిన కంపెనీలు.. బిజినెస్ ఫర్మ్స్ అన్నిటినీ నమ్రతనే దగ్గరుండి చూసుకుంటారు. అలాగే మహేష్ సినిమాల బిజినెస్ వ్యవహారాల్లోనూ తన హవా సాగుతుంటుంది. అయితే ఒకే ఒక్క విషయంలో మాత్రం నమ్రత వేలు పెట్టరు. అదే కథల ఎంపిక.మహేష్ తదుపరి ఏ సినిమా చేస్తారు? అన్నది తనకు సంబంధం ఉండదు. మహేష్ ఏ కథ విన్నారు? ఏ బ్యానర్ కి సంతకం చేయబోతున్నారు? అన్నది మహేష్ ముందే రివీల్ చేయరు. అది మాత్రం సస్పెన్స్ గా ఉంటుంది. అప్పటికప్పుడు మహేష్ నిర్ణయం తీసుకుని నమ్రతకు రివీల్ చేస్తారు అంతే. ఈ సంగతులన్నీ ఎవరు చెప్పారు? అంటే .. నమ్రతనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ప్రస్తుతం మహేష్ ప్రొడక్షన్ లో అడివి శేష్ కథానాయకుడిగా `మేజర్` తెరకెక్కనుంది. 26/11 ముంబై దాడుల్లో సాహసం ప్రదర్శించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.