నాకు పెళ్ళవనిది రశ్మి వల్లే.. షాకిచ్చిన సుడిగాలి సుధీర్

అమ్మాయిల పిచ్చోడని, రష్మీతో రిలేషన్ ఉందన్న పుకార్ల వల్ల పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని చెప్పాడు. తనకు పిల్లను ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచార నిజమేనని అంగీకరించాడు సుధీర్.రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్..! ఎప్పుడూ ‘టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌’గా ఉంటోంది ఈ జంట. యూత్‌లో వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ ఉంది.స్మాల్ స్క్రీన్‌పై సుధీర్-రష్మీ రొమాన్స్‌‌‌ని చూసి వీరిమధ్య నిజంగానే ఏదో ఉందనే పుకార్లు ఎప్పటి నుంచో షికారు చేస్తున్నాయి.

అదేం లేదని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా జనాలు మాత్రం నమ్మడం లేదు. తాజాగా రష్మితో రిలేషన్ గురించి సుడిగాలి సుధీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రష్మితో ఏదో ఉందంటూ ప్రచారం జరగడం వల్ల..తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని ఓ యూట్యూబ్ ఛానెల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.స్క్రీన్‌పై నవ్వించడానికే రిష్మితో లింక్ పెట్టి స్కిట్స్ రాస్తుంటారని చెప్పాడు సుధీర్. అంతేతప్ప మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని..అందరిలాగే తానూ ఫ్రెండని స్పష్టంచేశాడు. రష్మికి తనకు ఏజ్ గ్యాప్ ఉందని తెలిపాడు. రీల్ లైఫ్‌లోని సంబంధాన్ని రియల్ లైఫ్‌కి ఆపాదించడం సరికాదని చెప్పాడు ఈ జబర్దస్త్ స్టార్.గతంలో తన లవ్ ఫెయిలైందని చెప్పిన సుధీర్.. ఆ కారణం వల్లే అమ్మాయిలకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు.

మళ్లీ లవ్ చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టంచేశాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తనకు కూడా తెలియదని చెప్పాడు ఈ స్మాల్ స్క్రీన్ హీరో. అమ్మాయిల పిచ్చోడని, రష్మీతో రిలేషన్ ఉందన్న పుకార్ల వల్ల పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని చెప్పాడు. తనకు పిల్లను ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచార నిజమేనని అంగీకరించాడు సుధీర్.