అదిరిపోయిన నాగార్జున కొత్త ట్యాటు.. దీని వెనుక ఇంత రహస్యం ఉందా..?

ఆరుపదుల వయసులో కూడా చెరగని అందంతో తరగని ఫాలోయింగుతో, అప్పటికి ఇప్పటికి ట్రెండ్ ఫాలో అవుతూ ఎనలేని అభిమానులతో దూసుకుపోతున్న స్టార్ హీరో అక్కినేని నాగార్జున.న్యూ జెనెరేషన్ ను ఇండస్ట్రీలోకి తీసుకురావడంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.ఇకపోతే మన్మథుడిగా ఎందరో అమ్మాయిల మనసును కొల్లగొట్టిన నాగ్ తనకొడుకులకు పోటీ ఇస్తూ వస్తున్నాడు. యంగ్ లుక్ తో కొత్త ఫ్యాషన్ తో అందరిని ఆకర్షిస్తూ వస్తున్నారు కింగ్ నాగ్. మొన్ననే అయన స్పెయిన్లో తన 60 వ పుట్టినా రోజు వేడుకలను అంగరంగ వైభవంగా తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు.

ఇది ఇలా ఉండగా అక్కడ అయన తన చేతిపై ఒక టాటూను వేయించుకున్నారు. తాజాగా బిగ్ బాస్ షో కి న్యాచురల్ స్టార్ నాని రాగా, ఆ టాటూను చూసి ఆబొమ్మ వెనుక దాగిన అసలు రహస్యం ఏంటని కోరగా నాగ్ దానిగురించి చెప్పాడు. పాము కుబుసాన్ని విడిచినట్లు నేను నా గతంలోని చెడును వదిలేస్తాను. కన్ను సింబల్ ఏమో మంచి మార్గాన్ని వెతుకోవడం కోసం గుర్తు. ఇకపోతే దిక్సూచి అనేది ఏదైతే మంచి అనిపిస్తుందో దానికి సంకేతం అని అయన వెల్లడించారు.నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో నాని తన స్టయిల్లో అందరిని పలకరించి అందరి దృష్టిని తనవైపు లాక్కొని సెంటర్ అఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించారు.ఆ సినిమా రిలీజ్ కి దగ్గరిలో ఉంది. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నాడు.నిన్ను కోరి ఫెమ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రెండో సారి సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని సినీ ప్రముఖులు వెల్లడిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి…