మన్మదుడు 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. నాగార్జున గట్టెక్కాడా..?

నాగార్జున మన్మథుడు 2 సినిమా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ తో పరవలేదనిపించింది. మిక్సీడ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ ఎంతవరకు పెరుగుతాయి అనేది చెప్పడం కష్టంగానే ఉంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి మినిమామ్ వసూళ్లను అందుకుంటుందని టాక్. ఇక పోటీగా కూడా పెద్ద సినిమలేమి లేకపోవడం మన్మథుడికి కలిసొచ్చే అంశం..

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే. మొదటి రోజు మన్మథుడు 2 వరల్డ్ వైడ్ గా 8.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక షేర్స్ విషయానికి వస్తే 4.89కోట్లను రికవర్ చెసినట్లు సమాచారం. ప్రస్తుతం టాక్ చూస్తే. సినిమాలో అడల్ట్ కామెడీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే. కానీ యూత్ ఆడియెన్స్ ని సినిమా బాగానే ఆకట్టుకుంటోంది. వెన్నెల కిశోర్ కామెడీ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్.18.4కోట్ల తియేట్రికల్ వాల్యూ కలిగిన మన్మథుడు 2 హిట్ లిస్ట్ లో చేరాలంటే మినిమామ్ 20 కోట్ల షేర్స్ ని రాబట్టాలి.ఫస్ట్ డే ఒక వంతు షేర్స్ ని అందుకున్న ఈ సినిమా ఇంకా 16 కోట్ల వరకు రికవర్ చేయాల్సి ఉంది.

మరి ఈ హాలిడేస్ లో ఎంతవరకు రాబడుతుందో చూడాలి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ పై నాగ్ సొంతంగా నిర్మించారు.