నాగార్జునకు దెబ్బేసిన సంపూ.. మన్మదుడు 2 కంటే దానికే ఎక్కువ వసూళ్ళు

ఒక ఏరియాలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున సినిమా.. కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు న‌టించిన సినిమా ఒక రోజు వ్య‌వ‌ధిలో రిలీజైతే వాటిలో సంపూ సినిమాకు రోజు మొత్తం షోలు క‌లిపితే ఎక్కువ వ‌సూళ్లు వ‌స్తాయ‌ని ఎవ‌రైనా ఊహిస్తారా? కానీ ఊహించ‌నిదే జ‌రిగింది. హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శ‌నివారం నాగ్ మూవీ ‘మ‌న్మ‌థుడు-2’ కంటే సంపూ సినిమా *కొబ్బ‌రిమ‌ట్ట‌*కే ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి.మ‌న్మ‌థుడు-2 శుక్ర‌వారం రిలీజ్ కాగా.. కొబ్బ‌రిమ‌ట్ట శ‌నివారం విడుద‌లైంది.

ఐతే గ్యాప్ ఒక్క రోజే కాబ‌ట్టి నాగ్ సినిమా పాత‌ది అనుకోవ‌డానికి లేదు.కొత్త సినిమాల‌కు శ‌నివారం మంచి వ‌సూళ్లు వ‌స్తాయి మామూలుగా. ఐతే బాగా నెగెటివ్ టాక్ రావ‌డంతో ‘మ‌న్మ‌థుడు’ వ‌సూళ్ల‌పై ఎఫెక్ట్ కూడా బాగానే ప‌డింది.శుక్ర‌వారం ఉద‌యం షో మిన‌హాయిస్తే.. రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఇక్క‌డి శాంతి థియేట‌ర్లో *మ‌న్మ‌థుడు-2*కు వేరే షోలేవీ కూడా హౌస్ ఫుల్ కాలేదు. ఆ థియేట‌ర్ కెపాసిటీ త‌క్కువ అయిన‌ప్ప‌టికీ ఫుల్స్ ప‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. కానీ పెద్ద థియేట‌ర్ అయిన సంధ్య 70 ఎంఎంలో కొబ్బ‌రిమ‌ట్ట చిత్రానికి 1 ల‌క్ష 14 వేల‌కు పైగా గ్రాస్ రావ‌డం.. దాదాపు థియేట‌ర్ హౌస్ ఫుల్ కావ‌డం అనూహ్యం. శాంతిలో మ‌న్మ‌థుడు-2 సెకండ్ షోకు వ‌చ్చిన గ్రాస్ 70 వేలే.

శ‌నివారం మొత్తం నాలుగు షోల‌కు క‌లిపి కొబ్బ‌రిమ‌ట్ట 2.88 ల‌క్ష‌ల గ్రాస్ రాబ‌డితే.. మ‌న్మ‌థుడు-2 మాత్రం 1.93 ల‌క్ష‌లే క‌లెక్ట్ చేసింది. పోనీ తొలి రోజైనా కొబ్బ‌రిమట్ట కంటే మ‌న్మ‌థుడు-2 ఎక్కువ క‌లెక్ట్ చేసిందా అంటే అదీ లేదు. శుక్ర‌వారం నాలుగు షోల‌కు క‌లిపి వ‌చ్చిన గ్రాస్ 2.83 ల‌క్ష‌లే. ఇది నాగార్జున బాక్సాఫీస్ స్టామినాకు పెద్ద దెబ్బ అన‌డంలో సందేహం లేదు.