ఆటాడుకుంటున్న నాగార్జున.. బిగ్ బాస్ లో ఎవరిని వదలడం లేదుగా

బిగ్ బాస్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా అయితే ఇప్పటికే ప్రసరమైనటువంటి రెండు సీజన్ల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ షో, ఇటీవలే మూడవ సీజన్ రూపంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని మరీ ప్రారంభం అయింది. కాగా ఈ షో ప్రారంభం అయినప్పటి నుండే కంటెస్టెంట్ల మధ్యన ఎన్నో గొడవలు కూడా చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ షో నుండి హేమ, జాఫర్లు బయటకు పోగా తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిందని తెలుసు.

అయితే ఇప్పడున్న వారందరి మధ్యలో రచ్చ ఒక రేంజ్ లో జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. కాగా ఈ వారంలో బిగ్ బాస్ కాంటస్టెంట్లకు కొన్ని టాస్క్ లు ఇచ్చాడు. ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టాస్క్‌, సీక్రెట్ టాస్క్ ఒకటి ఇచ్చారు.అయితే ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టాస్క్‌ లో రక్తపాతాన్ని సృష్టించి శ్రీముఖిని అందరూ కలిసి నామినేషన్లోకి పంపించారు. అయినప్పటికీ కూడా ఈ టాస్క్‌లో అలీ రెజా, హిమజ మధ్య ఒక పెద్ద గొడవ జరిగిందని చెప్పాలి. మరొక టాస్క్ లో ,అలీ, పునర్నవి ల వలన కూడా చాలా పెద్ద గొడవ జరిగిందని చెప్పాలి. పక్కాగా చెప్పాలంటే అందరు కూడా కొట్టుకునే వరకు వెళ్లారు కూడా. అయితే ఈరోజు వీక్ఎండ్ కావడంతో నాగార్జున వస్తారు. అయితే నాగార్జున కి సంబందించిన కొన్ని ప్రోమోలు విడుదల చేశారు నిర్వాహకులు. అందులో ప్రతి కంటెస్టెంట్ పై వారు చేసిన తప్పులకు తగిన శిక్షగా ఫుల్ ఫైర్ అయ్యాడు.

అలీ రెజా కు డ్రెస్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదు అని తిట్టగా, వితిక, తమన్నా సింహాద్రి, రాహుల్ పై చాలా సీరియస్ అయ్యారు నాగార్జున. అయితే ఇదంతా ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే షో చూడాల్సిందేనని నిర్వాహకులు అంటున్నారు.