పిల్లలకు ఇంత ప్లానింగా..? చైతూ అన్సర్ కు షాకవుతున్న అభిమానులు

పెళ్లై మూడేళ్లవుతున్నా ఇంకా పిల్లల గురించి ఆలోచించడం లేదు నాగచైతన్య, సమంత దంపతులు. ఇప్పటికే సమంత ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. తాజాగా నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ గురించి మీడియాతో మాట్లాడారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో సమంత, నాగచైతన్యలది చూడముచ్చటైన జంట. ఎనిమిదేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లై మూడేళ్లు అవుతున్నా వీరు ఇంకా పిల్లల గురించి ఆలోచించలేదు. ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో పిల్లల గురించి సమంతపై ప్రశ్నల వర్షం కురిసింది. వీటికి ఆమె ఓపిగ్గా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చేవారు. ఇప్పుడు నాగచైతన్యకు ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

తాజాగా ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయిన చైతన్య పిల్లల గురించి మాట్లాడారు. ‘త్వరలోనే పిల్లల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం నా జీవితం చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. దేవుడు నాకు ఇచ్చినవాటితో తృప్తిగా ఉంది. ఇంతకుమించి ఇంకేమీ అడగలేను’ అన్నారు.ఇంతకుముందు సమంత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి మాట్లాడుతూ.. ‘నాకు బిడ్డ పుట్టాక తనే నా ప్రపంచం అవుతుంది. పని చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న తల్లులపై నాకు అపారమైన గౌరవం ఉంది. నా బాల్యం అంత హాయిగా గడవలేదు. చిన్నతనంలో నాలాంటి జీవితం గడిపిన వాళ్లు పిల్లల గురించి మాట్లాడుతూ.. తాము కోరుకున్న జీవితాన్ని అనుభవించలేకపోయారని పిల్లలకైనా బంగారు భవిష్యత్తును ఇవ్వాలనుకుంటారు. నాది కూడా అదే ఆలోచన. కాబట్టి నాకు బిడ్డ పుట్టిన కొన్నేళ్ల తర్వాత తనే నా లోకం అవుతుంది. ఆ సమయంలో ఇంకెలాంటి పనులు పెట్టుకోను. తనే నా సర్వస్వం అవుతుంది. పిల్లల విషయంలో నేను, చైతూ ఒక తేదీ అనుకున్నాం. అది మీకు చెప్పను. ఎందుకంటే అనుకున్న తేదీకి మాకు పిల్లల పుట్టకపోతే మీరంతా చైతూని అనుమానిస్తారు’ అని వెల్లడించారు.

t

ఇటీవల సమంత, చైతన్య కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం యూరప్ వెళ్లారు. ఓ రెండు వారాల పాటు హాయిగా అక్కడే ఎంజాయ్ చేశారు. ఇటీవల హైదరాబాద్ వచ్చారు. వచ్చీ రాగానే చైతూ తన తర్వాతి సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. మరో పక్ సమంత ‘96’ సినిమా రీమేక్‌తో బిజీగా ఉంది. ఇందులో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్నారు.