నాగ చైతన్య దెబ్బ.. శేఖర్ కమ్ములకు చిక్కులు తెస్తున్న సమంత..

‘ఓ బేబి’ ఘన విజయంతో చాలామంది దర్శక నిర్మాతలు సమంత డేట్స్ కోసం తిరుగుతున్నారు. అయితే సమంత మాత్రం ఇప్పుడు శేఖర్ కమ్ముల అంగీకారం కోసం ఎదురు చూస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.క్రియేటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల నాగచైతన్య సాయి పల్లవిలతో ప్రారంభించిన మూవీ షూటింగ్ ఆగష్టు 1 నుండి ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో తెలంగాణ యాసతో మాట్లాడే తెలంగాణ అబ్బాయిగా నాగచైతన్య క్లాసికల్ డాన్సర్ గా సాయి పల్లవి నటిస్తున్నారు.

నాగచైతన్యకు శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉన్నట్లే సమంతకు కూడ తన కెరియర్ ప్రారంభం నుండి శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని ఒక డ్రీమ్ ఉందట. అయితే చైతూకు ఈ కోరిక తీరినా సమంతకు ఇంకా ఆ కోరిక తీరకపోవడంతో నాగచైతన్య శేఖర్ కమ్ములతో చేస్తున్న లేటెస్ట్ మూవీలో తనకు ఒక అతిథి పాత్ర ఇమ్మని చైతు ద్వారా రాయబారం నడిపినట్లు టాక్. సమంత కోరిక విని షాక్ అయిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పటికే పూర్తిగా తయారు అయిపోయిన ఈమూవీ స్క్రిప్ట్ లో సమంతకు ప్రాధాన్యత కలిగించే అతిథి పాత్రను ఎలా క్రియేట్ చేయాలి అంటూ తన స్టోరీ టీమ్ తో సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈవార్తలే నిజం అయితే సమంత నాగచైతన్య సాయి పల్లవి లతో రూపొందుతున్న ఈమూవీ ప్రాజెక్ట్ కు అత్యంత భారీ బిజినెస్ అవుతుందని అంటున్నారు..