దాని వల్లే నా పెళ్ళి ఆగిపోయింది.. ఎంగేజ్‌మెంట్ ఎప్పుడో అయ్యింది.. షాకిచ్చిన జబర్దస్త్ వినోద్

‘జబర్ధస్త్’ కామెడీ షో ద్వారా ఎంతో మంది కళాకారులు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోందీ షో. అందుకే ‘జబర్ధస్త్’కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో వినోద్ అలియాస్ వినోదిని ఒకడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న అతడు.. బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

వినోద్.. జబర్ధస్త్ షో ద్వారా బుల్లి తెరకు పరిచయం అయ్యాడు. ఎప్పుడూ ఆడ వేషాలతోనే కనిపించే వినోద్.. వినోదిని అనే పేరుతో ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర స్కిట్లలో వినోద్ చేసే పర్‌ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. జబర్ధస్త్ షోలోనే కాకుండా బయట జరిగే ఈవెంట్లకు కూడా ఆడవేషాలతోనే వెళ్తుంటాడు. దీంతో అతడికి ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా చాలా మంది తనను సెల్ఫీలు అడుగుతుంటారని వినోద్ గతంలో చెప్పాడు.జబర్ధస్త్ కమెడియన్ వినోద్ తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఒకసారి వినోద్‌కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నింగా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత అతడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం అయింది. ఇక, తాజాగా జరిగిన దాడి ఘటనతో అతడు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. దీని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

ఇటీవల వినోద్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాదు, ఇది పెద్ద దుమారమే రేపింది. దాని తర్వాత జబర్ధస్త్ వాళ్లు అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చాడు వినోద్. ‘ఈ మధ్య నాకు జరిగిన ఇష్యూలో జబర్ధస్త్ ఫ్యామిలీ నాకు తోడుగా నిలిచింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్’ అని వినోద్ చెప్పాడు.
జబర్దస్త్ షోతో పాటు తనకు వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. ‘నేను మొదట రామప్ప అనే సినిమాలో చేశాను. ఆ తర్వాత రెండు మూడు టీవీ షోలలో పాల్గొన్నాను. వీటి తర్వాతే జబర్ధస్త్‌లో అవకాశం వచ్చింది. అయితే, ఎక్కడా రాని పేరు ఈ షోలో వచ్చింది. అందరికీ వినోదినిగా బాగా గుర్తుండిపోయేలా ఫేమస్ అయ్యానంటే దానికి కారణం జబర్ధస్తే’ అని వినోద్ వివరించాడు.

అలాగే, తన పెళ్లి గురించి వివరిస్తూ.. ‘నాకు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఈ శ్రావణమాసంలో పెళ్లి జరగాల్సింది. కానీ, ఆ ఘటన (దాడి) జరగడం వల్ల అది ఆగిపోయింది. నేను మానసికంగా, శారీరకంగా ధృడంగా అయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. ఈ ఇష్యూ కూడా క్లియర్ అవ్వాలి కదా. మరోసారి మంచి ముహూర్తం చూసుకుని పెట్లుకుంటాం’ అని పేర్కొన్నాడు.తనతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాడు వినోద్. ‘నేను ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయి మా బంధువే. తను నన్ను చిన్నప్పటి నుంచి చూస్తోంది. నా గురించి ప్రతి విషయం తెలుసు. ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందులు రావన్న నమ్మకం ఉంది. అందుకే నాతో పెళ్లికి ఒప్పుకుంది’ అని వినోద్ చెప్పుకొచ్చాడు.