మెరిసే అందాలతో కియారా.. అమె బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా?

కైరా అద్వానీ రీసెంట్ గా తీసిన సినిమా కబీర్ సింగ్. ఈ సినిమా భారీ విజయం సాధించింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద రూ. 275 కోట్లు వసూలు చేసి 2019లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. హీరోకైనా, హీరోయిన్‌కైనా సినిమా విజయం అందించే కిక్కే వేరు. ప్రస్తుతం కియారా అడ్వాణి కూడా అలాంటి కిక్కేనే అనుభవిస్తుందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ మధ్య కైరా తన 27వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. తన బర్త్ డే పార్టీకి సిద్దార్థ మల్హోత్ర, కరణ్‌ జోహార్‌, షాహిద్‌ కపూర్‌ ఇంకా మరికొందరు పాల్గొన్నారు. అప్పుడు కియారా ఓ చానెల్‌ బ్యాగ్‌ను వేసుకుంది. ఆ బ్యాగ్ అక్షరాల రూ.3లక్షల 47వేల 974లకు పైగానే ఉంటుందట. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ చానెల్‌ బ్యాగు లాంబ్ స్కిన్ లెదర్ తో వైట్ కలర్ లో ఉంది. దాని మీద గోల్డ్ కలర్ లో మెరిస్తున్న చైన్ లింక్ కూడా ఉంది. మధ్య మధ్యలో తెల్లని ముత్యలతో అదిరిపోయింది. ఇక కైరా ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ తో కలిసి ‘లక్ష్మీబాంబ్‌’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.