మెగాస్టార్ సైరా బంపర్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ..!

సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, తన 151వ చిత్రంగా ‘సైరా’లో నటిస్తున్నారు. వచ్చేనెల 2వ తేదీన విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే అమెరికాలో మాత్రం‘సైరా’ అక్టోబర్ 1వ తేదీనే రిలీజ్ కానుంది. దీంతో ఆ రోజు మెగా అభిమానులకు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు అదిరిపోయే ఆఫర్ ఇస్తున్నారు. ఒక టికెట్ కొంటే మరో టికెట్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.

అయితే దీనికి ఓ కారణం కూడా ఉందండి. అక్టోబర్ 2 గాంధీ జయంతి.. భారతీయులందరికీ సెలవు. కాబట్టి సినిమా విడుదలకు ఎలాంటి ఢోకా లేదు. కానీ… అమెరికాలో సైరా విడుదలవుతున్న రోజు అక్టోబర్ 1 అంటే మంగళవారం. మంగళవారం అక్కడవాళ్లకు వర్కింగ్ డే. ఎవరికి సెలవులు ఉండవు. దీంతోఅందరూ ఉద్యోగాలకు వెళ్లే రోజు. ఆ రోజున ఎవరూ సినిమాలు చూసేందుకు ఇష్టపడరు. అందుకే అమెరికాలో పలు సంస్థలు మంగళవారం నాడు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటాయి. అందులో భాగంగానే ‘సైరా’కు కూడా ఆఫర్ వచ్చింది. అమెరికాలో ఏటీ అండ్ టీ సంస్థ ‘సైరా’ టికెట్లను ఆన్ లైన్లో విక్రయిస్తోంది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, తన 151వ చిత్రంగా ‘సైరా’లో నటిస్తున్నారు. వచ్చేనెల 2వ తేదీన విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చిరంజీవి కుమారుడు, హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. హీరోయిన్లుగా నయనతార, తమన్నా సైరాలో మెరవనున్నారు.బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా సైరాలో నటిస్తున్న విషయం తెలిసిందే.