మెగాస్టార్ కు అవమానమా..? నయనతార ఇంత పని చేసిందా..?

సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా మంచి ఫాంలో ఉన్న బ్యూటీ నయనతార. ఇంకా చెప్పాలంటే వ‌రుస‌గా లేడీ ఓరియంటెడ్ రోల్ సినిమాలు చేస్తూ సూప‌ర్ హిట్లు కొడుతోన్న ఆమెకు హీరోలు అక్క‌ర్లేద‌న్న రేంజ్‌కు వెళ్లిపోయారు. స్టార్ హీరోల‌తో స‌మాన‌మైన రెమ్యున‌రేష‌న్ అందుకుంటోన్న ఆమె అస‌లు తెలుగులో సినిమాలు చేసేందుకే ఒప్పుకోని పరిస్థితి.ఇక ఎంత స్టార్ హీరోతో సినిమా చేసినా న‌య‌న‌తార మాత్రం ప్ర‌మోష‌న్ల‌కు రావ‌డం లేద‌న్న కంప్లెంట్లు ఆమెపై ఉన్నాయి. తెలుగులో వెంక‌టేష్‌తో చేసిన బాబు బంగారం సినిమాకు ఆమె పెట్టిన కండీష‌న్లు అన్నీ ఇన్నీకావు.

ఇక ఇప్పుడు న‌య‌న‌తార మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరుకు జోడిగా నటించారు.మెగాస్టార్ సినిమా కావ‌డం.. చిరు కెరీర్‌లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ఈ సినిమాలో ఉన్న వారంద‌రూ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన సైరా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో చిరంజీవితో పాటు సుధీప్‌, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ లాంటి నటులు పాల్గొన్నా.. నయనతార మాత్రం ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.న‌య‌న‌తార‌ను ప్ర‌మోష‌న్‌కు ఇన్వైట్ చేసినా చిరు సినిమా అయినా నాకేంటి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తెలుస్తోంది. దీనిని కాంట్ర‌వర్సీ చేయ‌డం ఇష్టంలేని రామ్‌చ‌ర‌ణ్ సైలెంట్‌గా ఉంటున్నాడ‌ట‌. ఈ సినిమాలో న‌టిస్తోన్న మ‌రో హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా సైతం ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటోంది. న‌య‌న మాత్రం చిరు అయితే నాకేంటి అని చాలా చాలా లైట్ తీస్కొంటోంద‌ట‌. ఇది చిరుకు పెద్ద అవ‌మాన‌మే అన్న గుస‌గుస‌లు కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.