మెగాస్టార్ సైరాకు గట్టి దెబ్బ.. అసలు కారణం చరణేనా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అమితాబ్,సుదీప్ మరియు విజయ్ సేతుపతి లాంటి అగ్ర నటుల కలయికలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ పీరియాడిక్ ఎపిక్ డ్రామా “సైరా నరసింహా రెడ్డి”. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రామాణికాలతో చాలా ప్రతిష్టాత్మకంగా చిరు తనయుడు రామ్ చరణే నిర్మాతగా వ్యవహరించారు.మొత్తం 5 భాషల్లో విడుదల చెయ్యాలని ముందే ప్లానింగ్ వేసుకున్నారు.

అలాగే ఎన్నో అంచనాల నడుమ చిత్రాన్ని విడుదల చేసారు కూడా.కానీ ఒక్క తెలుగులో మినహా ఏ చిత్రం ఎక్కడా కూడా ఊహించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోతుంది.మన పక్క రాష్ట్రాల్లో ఏమో కానీ హిందీ వెర్షన్ లో మాత్రం 4 స్టార్ రేటింగ్ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని చూసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావట్లేదు.దీనికి కారణం మాత్రం ఖచ్చితంగా రామ్ చరణే అని అభిమానులే అంటున్నారు.

ఇంత మంచి సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని అలాంటి సినిమాకు హిందీలో సరైన ప్రమోషన్లు చెయ్యక ఇప్పుడు ఇలాంటి దుస్థితికి తీసుకొచ్చారని కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.చరణ్ అక్కడ మార్కెట్ లో కూడా ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే సైరాకు ఖచ్చితంగా మరింత అద్భుతమైన వసూళ్లు వచ్చి ఉండేవని అంటున్నారు.ఇది కూడా ఒక రకంగా నిజమే అని చెప్పాలి.ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలకు హిందీలో మంచి ఆదరణ వస్తుంది.ఈ సినిమాను కానీ అక్కడ పక్కా ప్లానింగ్ తో ప్రమోట్ చేసి విడుదల చేసినట్టయితే తప్పకుండా అద్భుత విజయాన్ని అందుకునేది.