రేటు పెంచేసిన వరుణ్ తేజ్.. ఒక్క సినిమాకే ఇంత తీసుకుంటున్నాడా..?

ఇప్పటివరకు స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ నినాదాన్ని పాటిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక్కసారిగా తన గేర్ మార్చేశాడు. అతను తీసే సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా వరుస హిట్లు కొడుతూ తన తోటి హీరోలకు అందకుండా దూసుకుపోతున్నాడు. తనతో పాటు హీరోలుగా ఇండస్ట్రీకి వచ్చిన యువ హీరోల కెరీర్ ఒక హిట్టు రెండు ప్లాప్స్ అన్నట్టుగా వెళ్తుంటే వరుణ్ మాత్రం విభిన్న కథలను ఎంచుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ‘వాల్మీకి’ (గద్దలకొండ గణేష్) సినిమా కూడా హిట్ అవ్వడంతో వరుణ్ మార్కెట్ బాగా పెరిగింది. దీంతో ఇప్పటివరకు 3 నుండి 4 కోట్లు ఉన్న అతని రెమ్యునరేషన్ ఒక్కసారిగా డబుల్ చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ‘తొలిప్రేమ – ఎఫ్ 2 – వాల్మీకి’ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వడంతో వరుణ్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. దాంతో వరుణ్ తన రెమ్యునరేషన్ ని 7 నుండి 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు.

గత కొన్ని సంవత్సరాల నుండి వరుణ్ నుండి వస్తున్న సినిమాలు ‘అంతరిక్షం’ మినహాయించి అన్ని సినిమాలు నిర్మాతలకు లాభాలు తీసుకు రావడంతో నిర్మాతలు రెమ్యునరేషన్ ఎక్కువైనా వరుణ్ తో సినిమాలు చేయడానికి సిద్దపడుతున్నారు.