మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్… సినిమాల నుండి తప్పుకుంటున్న చిరంజీవి

అవును… ఇది నిజంగానే మెగా అభిమానులందరికి కూడా షాకింగ్ వార్తే అని చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి చిత్ర పరిశ్రమ పరంగానే కాకుండా తన వ్యక్తిత్వానికి, సేవలకు కూడా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే. వారిని అభిమానులు అనే కంటే భక్తులు అని చెప్పడంలో తప్పులేదు. కాగా చిత్ర పరిశ్రమ నుండి నేరుగా రాజకీయాల్లో అడుగు పెట్టి, ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి ప్రజలందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ప్రజలతో కలిసిపోయారు. ఆ తరువాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాగా అప్పటికి ఇప్పటికి తనకు ఎదురే లేరని చిరంజీవి మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు.

ఇక అసలు విషయం ఏంటంటే… చిరు తన తాజా 152వ చిత్రాన్ని గురువారం నాడు ప్రారంభించారు. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరో పాత్రలకు గుడ్ బై చెబుతాడని ప్రచారం జరుగుతుంది. కాగా హీరోగా మానేసి తన వయసుకి తగ్గట్లుగా మంచి పాత్రలు చేయాలనీ, అమితాబ్ బాటలోనే నడవాలనుకుంటున్నట్లు సమాచారం. కానీ చిరు తీసుకున్న ఈ సంచలనాత్మకమైన నిర్ణయాన్ని మెగా అభిమానులు ఎలా తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం కాస్త అధికారికంగా వెలువడాల్సి ఉంది.