మంటపెట్టిన అల్లుఅర్జున్.. మండిపడుతున్న మెగా అభిమానులు

అల్లు అర్జున్ మీడియం రేంజి హీరోగా ఉన్నపుడు చాలా అణకువతో కనిపించేవాడు. కానీ అతను పెద్ద స్టార్ అయ్యాక యాటిట్యూడ్ మారిపోయింది. సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి.. మెగా అభిమానులందు తనకంటూ ప్రత్యేకంగా అభిమానవర్గాన్ని తయారు చేసుకోవడానికి అతను ప్రయత్నం చేయడం స్పష్టంగా కనిపించింది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులతో సున్నం పెట్టుకున్నాడు. దానికి అతను పెద్దగా ఫీలైనట్లు కూడా కనిపించలేదు. తర్వాతి రోజుల్లో కవర్ చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.

బన్నీ అభిమానులు వేరు.. చిరు, పవన్, చరణ్ అభిమానులు వేరు అన్నట్లుగానే సాగుతోంది వ్యవహారం. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ ఈ అంతరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నారు.బోయపాటి శ్రీనుతో మళ్లీ ఓ సినిమా అంటూ నిన్న అనౌన్స్ చేసినప్పటి నుంచి చరణ్ అభిమానుల నుంచి ఏమంత సానుకూల స్పందన కనిపించడం లేదు. ఈ సినిమాలో హీరోగా నటించేది చిరంజీవా.. బన్నీనా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఐతే తన కొడుక్కి ‘వినయ విధేయ రామ’ లాంటి డిజాస్టర్ ఇచ్చిన బోయపాటితో చిరు సినిమా చేయడానికి సానుకూలంగా లేరట. ఆ సినిమా రిలీజ్ తర్వాత నష్టపరిహారం చెల్లించే విషయంలో బోయపాటి పేచీ పెట్టడం చిరుకు నచ్చలేదని సమాచారం. అందుకే ముందు అతడితో సినిమా కమిటైనవాడు తర్వాత వెనక్కి తగ్గాడు.

బన్నీకి పెద్ద హిట్టిచ్చి చరణ్‌కు ఇంత పేలవమైన సినిమా ఇచ్చాడని బోయపాటిపై చరణ్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో బన్నీ హీరోగా బోయపాటితో మళ్లీ సినిమా చేయడానికి రెడీ అవడం మెగా అభిమానుల్లో ఓ వర్గానికి అస్సలు నచ్చడం లేదట. ఈ ప్రకటన చేసి అరవింద్ అగ్గి రాజేసినట్లే కనిపిస్తోంది.