మహేష్ రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు…

సూపర్ స్టార్ మహేష్ హీరోగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హ్యాట్రిక్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న మహేష్ ఇప్పుడున్న క్రేజ్ ఊహించిందే.. అయితే 26 సినిమాల కెరియర్ లో మహేష్ కొన్ని క్రేజీ సినిమాలను వదిలేశాడు. మహేష్ వదిలేసినా సినిమాలు కూడా సెన్సేషన్ హిట్ అందుకున్నాయి. అందులో ముందుగా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే ఉంది. వి.ఎన్.ఆదిత్య డైరక్షన్ లో ఎం.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా కథ ముందు మహేష్ కు వినిపించారు. కానీ ఆ సినిమా ఎందుకో మహేష్ వదులుకున్నాడు.

ఇక మహేష్ వదిలేసినా మరో సూపర్ హిట్ మూవీ వర్షం. అప్పటికే బాబీ సినిమా తీసిన శోభన్ ఈసారి వర్షం కథతో మహేష్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాతోనే ప్రభాస్ కు మంచి మాస్ ఇమేజ్ వచ్చింది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన సినిమా గజిని. ఈ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ మహేష్ చేయనని చెప్పడంతో సూర్య సినిమానే ఇక్కడ రిలీజ్ చేశారు. ఆ సినిమాతో సూర్యకు తెలుగులో సూపర్ ఇమేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత నాగ్ చైతన్యకు మొదటి హిట్ ఇచ్చిన సినిమా ఏమాయ చేసావే ఈ సినిమాను మహేష్ సోదరి మంజుల నిర్మించగా ఈ సినిమా కథ ముందు మహేష్ కు అనుకున్నారు కానీ మహేష్ కాదని చెప్పడంతో చైతు చేశాడు. ఏ సినిమాతో సమంత తెలుగులో తెరంగేట్రం చేసింది.

ఇదే కాదు త్రివిక్రమ్ అ..ఆ సినిమాను మహేష్ కె అనుకున్నాడు. అది మహేష్ చేయలేదు. ఇక సూర్య, విక్రమ్ కుమార్ కాంబోలో వచ్చిన 24 మూవీ కూడా మహేష్ మిస్ చేశాడు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా మూవీ కూడా మహేష్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ కూడా మహేష్ కు కథ వినిపించగా ఆ కథ నచ్చక మహేష్ వదిలేశాడు. ఈ సినిమాలన్నీ చేసుంటే మహేష్ రేంజ్ మరోలా ఉండేదని చెప్పొచ్చు.