మహేష్ ఫ్యాన్స్ పుల్ హ్యాపీ.. హవా మామూలుగా లేదుగా…

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11 న విడుదలకు సిద్ధమవుతోంది. తొలిరోజు వీలైలన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుంది కాబట్టి మహేష్ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా భారీగా ఎడ్వాంటేజ్ ఉండబోతోంది. రెండవరోజు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్ల సంఖ్య తగ్గుతుంది. అందుకే ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట.

 

ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో ఆసక్తి ప్రదర్శిస్తున్నారని ముందురోజు నైట్ ప్రదర్శించే బెనిఫిట్ షోలు.. ఎర్లీ మార్నింగ్ స్పెషల్ షోల సంఖ్యను పెంచాల్సిందిగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ప ఒత్తిడి పెంచుతున్నారట. ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తున్నారు కాబట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కు ఇబ్బంది ఉండకపోవచ్చు. అందుకే అర్థరాత్రి బెనిఫిట్ షోలకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ అవకాశం తెలంగాణాలో లేదు. గత కొన్నేళ్లుగా తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోలకు స్పెషల్ షోలకు అనుమతినివ్వడం లేదు.ఫ్యాన్స్ మాత్రం తెలంగాణాలో.. హైదరాబాద్ నగరంలో కూడా ఈ బెనిఫిట్ షోలు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారట.’సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుందా.. ప్రభుత్వం నుంచి స్పెషల్ షోలకు పర్మిషన్ తెచ్చుకోగాలదా అనేది వేచి చూడాలి.ఒకవేళ అనుమతులు లభిస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.