సరిలేరు కు మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో షాకవ్వాల్సిందే..?

గత కొన్ని రోజుల నుండి సూపర్ స్టార్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గడచిన రెండు సంవత్సరాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మార్కెట్ పెరిగింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల నిర్మాతలకు ఆదాయం కేవలం థియేట్రికల్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ ద్వారా మాత్రమే వచ్చేది.కానీ ప్రస్తుతం డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ తో సమానంగా అమ్ముడవుతున్నాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతలకు భారీగా ఆదాయం చేకూరుతోంది.

అందువలన స్టార్ హీరోలు కూడా రెమ్యూనరేషన్ భారీగా పెంచారు. భరత్ అనే నేను, మహర్షిలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత తెరకెక్కుతోన్న సినిమా కావటంతో సరిలేరు నీకెవ్వరు సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.మహేశ్ బాబు రెమ్యూనరేషన్ గురించి వార్తలు వస్తూ ఉండటంతో ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన అనీల్ సుంకర ఈ విషయంపై స్పందించారు. మహేశ్ బాబు ఈ సినిమాకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలై హిట్ అయిన తరువాత మాత్రమే వాటాను రెమ్యూనరేషన్ గా తీసుకుంటానని మహేశ్ చెప్పాడని అనీల్ సుంకర చెప్పారు.మహేశ్ బాబు ఈ సినిమాలో ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నాడు. మహేశ్ బాబుకు జోడీగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తోంది. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 2020 జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. దిల్ రాజు, అనీల్ సుంకర ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.