సరిలేరు కోసం మహేష్ నిజంగానే అంత రిస్క్ చేసాడా..? హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ గా 300 వందలకు పైగా సినిమాల్లో నటించి, ఎంతో గొప్ప మనసున్న హీరోగా అలానే సాహసానికి మరొక పేరుగా నిలిచిన లెజెండరీ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ. ఇక ఆయన తనయుడిగా చిన్నతనంలోనే పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించడంతో పాటు, హీరోగా రంగప్రవేశం చేసిన తరువాత, నటుడిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోల్లో ఒకరిగా ఉన్నత స్థానాన్ని అధిరోహించారు ఆయన తనయుడైన నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు.ఇక మొదటి నుండి తండ్రి కృష్ణ గారి వలె తన సినిమాల విషయమై డేరింగ్ అండ్ డాషింగ్ గా వ్యవహరించే మహేష్ బాబు, గతంలో తాను నటించిన పలు సినిమాల్లో కొన్ని సాహస కృత్యాలు చేసి, అందరితో శభాష్ అనిపించుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన కాశ్మీర్ షెడ్యూల్ లో భాగంగా అక్కడ షూటింగ్ చేయడానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుందట సినిమా యూనిట్.అంతేకాక ఆ సమయంలో అక్కడ కొంత అలజడి వంటి పరిస్థితులు నెలకొనడంతో షూటింగ్ ఆపేద్దాం అని సినిమా యూనిట్ కొంత ఆలోచన చేసిందట. అయితే ఆ తరువాత హీరో మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా బులెట్ ప్రూఫ్ జాకెట్ తో పాటు బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేసిందట. కాగా మహేష్ మాత్రం తన యూనిట్ సభ్యులకు ధైర్యం చెప్తూ ఏ మాత్రం సంకోచించకుండా, ముందుగానే అనుకున్న విధంగా షెడ్యూల్ పూర్తి చేయడానికి సాహసంతో రియల్ హీరోలా ముందడుగేశారట. ఇక అక్కడ షెడ్యూల్ జరిగినన్ని రోజులు తమ యూనిట్ కి రక్షణగా అక్కడి పోలీసులు నిలిచారని, ఇటీవల నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర వారికి తమ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. సో, ఎంతైనా సూపర్ స్టార్ అంటే సూపర్ స్టారే మరి…..!!