మగధీరలో రాం చరణ్ ఎంట్రీ సీన్ కోసం ఇంతలా కష్టపడ్డారా..?

రామ్ చరణ్ హీరోగా చేసిన రెండో సినిమా మగధీర. ఈ సినిమా వచ్చి పదేళ్లు దాటింది. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, అప్పట్లో ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. చరణ్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. చందమామ కాజల్ హీరోయిన్. పెరియాడికల్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతం అని చెప్పాలి.

ముఖ్యంగా బైక్ జంపింగ్ సీన్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. రామ్ చరణ్ ఇంట్రో సీన్ గా వచ్చిన ఈ సన్నివేశం తెరకెక్కించడానికి యూనిట్ చాలా కష్టపడింది. మామూలు కష్టం కాదు. ఫైట్ ను డిజైన్ చేసిన తరువాత… దానికి సంబంధించిన అన్ని రెడీ అయ్యాయి. రిహార్సిల్స్ చేశారు. ఫస్ట్ యాంగిల్ లో బైక్ ను స్టార్ట్ చేసి జంప్ చేయించారు. బైక్ గాల్లోకి లేవడం వరకు షాట్ ఒకే అయ్యింది.బైక్ అలా గాల్లోకి లేచిన తరువాత బైక్ ను వదిలేయాలి..గాల్లో ఉంచిన ఐరెన్ ఫ్రేమ్ మీద నుంచి అవతలికి దూకి గాల్లో ఉన్న బైక్ ను అందికొని దానిపై కూర్చోవాలి.. అది సీన్.. ఫస్ట్ హాఫ్ సీన్ షాట్ ఒకే అయ్యింది. సెకండ్ హాఫ్ సీన్ ను డిజైన్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. గాల్లోకి లేచిన తరువాత.. బైక్ అలా ముందుకు వెళ్ళింది.. దాన్ని అందుకోవడానికి యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ దూకాడు.. ఈలోగా అతనికి కట్టిన వైర్లు కట్ అయ్యాయి..అంతే క్షణాల్లో డ్యామేజ్ జరిగిపోయింది. పీటర్ హెయిన్స్ కిందపడ్డాడు. కిందపడేటప్పుడు ముఖానికి చేతులుఅడ్డుపెట్టుకున్నా .. చేతులకు తలకు గాయాలయ్యాయి.

వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అయితే, పీటర్ మాత్రం నాలుగు రోజులు సమయం ఇవ్వండి సీన్ చేద్దాం అని చెప్పగా, పూర్తిగా మాత్రమే సీన్ చేద్దామని చెప్పాడట రాజమౌళి. కోలుకున్నాకే ఈ సీన్ చేద్దామని లేదంటే అసలు సీన్ తీసేద్దామని అన్నారట. సరిగ్గా పదిరోజులకు పీటర్ హెయిన్స్ కోలుకున్నాడు. చెప్పినట్టుగానే సీన్ ను షూట్ చేశారు. ఆ సీన్ సినిమాలో హైలైట్ గా నిలిచింది.