మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరో లవర్.. పెళ్ళవకుండానే..!

బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తన భార్య నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత అతడి జీవితంలోకి మోడల్, బాలీవుడ్ ఐటం గర్ల్ గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్ ప్రవేశించింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరి రిలేషన్ షిప్ హద్దులు దాటేసింది. ”ప్రతీ రోజు నన్ను నలిపేసే మగాడు ఇతడే’ అంటూ ఓ రోజు అర్జున్ రాంపాల్ తన పడకగదిలో ఉన్న ఫోటోను గ్యాబ్రియెల్లా షేర్ చేయడంతో వీరి వ్యవహారం ఎంత వరకు వెళ్లిందో అందరికీ అర్థమైంది. గ్యాబ్రియెల్లా ఈ ట్వీట్ చేసిన కొన్ని రోజులకే అర్జున్ రాంపాల్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ నా గర్లఫ్రెండ్ గర్భం దాల్చింది, నేను తండ్రిని కాబోతున్నాను అంటూ ప్రకటించాడు.

కట్ చేస్తే వీరికి ఇపుడు పండండి బిడ్డ జన్మించాడు.బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం… గ్యాబ్రియెల్లా ముంబైలోని ఓ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బాలీవుడ్ నిర్మాత జేపి దత్తా కూతురు నిధి దత్తా ధృవీకరించారు. ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. 2009లో జరిగిన ఓ పార్టీలో వీరు తొలిసారి కలిశారు. అయితే అప్పుడు వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. కేవలం స్నేహితులుగానే ఉన్నారు. గతేడాది అర్జున్ రాంపాల్ తల్లి చనిపోయిన తర్వాత ఆమె అతడికి తోడుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలపడింది. ఇద్దరి ఆలచనలు, ఇష్టాలు కలవడంతో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. ఇద్దరూ కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చారు.గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్ సౌతాఫ్రికాకు చెందిన సూపర్ మోడల్. మిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాలీవుడ్ 2009లో పాల్గొనడానికి ఇండియా వచ్చి ఇక్కడే తనకెరీర్ కొనసాగిస్తున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఇపుడు అర్జున్ రాంపాల్‌తో కలిసి బిడ్డకు జన్మనివ్వడం ద్వారా ఆమె ఇండియాలోనే సెటిలవుతారని టాక్.

అర్జున్ రాంపాల్ ఒకప్పుడు బాలీవుడ్లో వరుస సినిమాలు చేశాడు. అయితే సరైన హిట్టు పడక స్ఠార్ హీరో రేంజికి వెళ్లలేక పోయాడు. అయితే నటుడిగా అతడికి మంచి గుర్తింపు ఉంది. గతేడాది అతడు నటించిన పల్టన్ మూవీ విడుదలవ్వగా… ప్రస్తుతం ‘నాస్తిక్’ అనే మూవీ చిత్రీకరణ దశలో ఉంది.