నివేథా పేతురాజ్ కు లక్కీ ఛాన్స్, స్టార్ హిరో సినిమాలో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే తన అభిమానులలో చాలా ఆసక్తికరం ఉంటుంది అనే చెప్పాలి. అంతేకాకుండా ఆ సినిమా హీరో ఎవరు కథ ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలని అభిమానులలో ఆసక్తి చాలా ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ” వకీల్ సాబ్ ” సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం పవన్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యి ఫస్ట్ షెడ్యూల్ కూడా ఫినిష్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్న విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు అనే చెప్పాలి. ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ అనుష్క పేరు వినబడిందనీ చెప్పాలి. కానీ అనుష్క నో చెప్పడంతో ఇంకో హీరోయిన్ని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు అలా వైకుంఠపురం సినిమాలో నటించిన నివేథా పేతురాజ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఆమెతో క్రిష్ మాట్లాడడం కూడా జరిగింది అని అంటున్నారు.

ఈ సినిమా కోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ తీసుకోవాలని అనుకున్నట్లు కూడా సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే విరూపాక్ష అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా వేయడం జరిగింది. ఇక ఈ సినిమా ను వచ్చే సంవత్సరం దసరాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే.. అది కూడా వచ్చే ఏడాదిలోనే విడుదలకు సిద్ధమవుతున్న ట్లు అర్థమవుతుంది.