లండన్ లో దొరికిపోయిన స్టార్ క్రికేటర్.. ఆ అమ్మాయితో చెట్టాపట్టాల్

ఇటీవల ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ నుంచి భారత క్రికెట్ జట్టు సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లంతా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అయితే, యువ క్రికెటర్ లోకేష్ రాహుల్ మాత్రం లండన్‌లోనే ఉండిపోయాడట. దీనికి కారణం అతడు తన గర్ల్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయడం కోసమేనని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ యంగ్ క్రికెటర్ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచాడు.

లోకేష్ రాహుల్ లండన్ వీధుల్లో ఓ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని ఓ కథనం ప్రసారం జరుగుతోంది. దీని ప్రకారం.. రాహుల్, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టితోనే కలిసి తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్ ముగిసిన తర్వాత వీళ్లిద్దరూ అక్కడే కలిసి ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.రాహుల్.. అతియాతో కలిసి తిరుగుతున్న విషయం బయటకు రావడానికి కారణం వీళ్లిద్దరూ లండన్‌లో ప్రచురణయ్యే పత్రికల వారికి దొరికిపోవడమేనని సమాచారం. దీనికి సంబంధించిన కథనాన్ని సదరు పత్రిక కూడా ప్రచురించిందట. ఈ కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గతంలో అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు రావడానికి కారణం.. ఆమె స్నేహితురాలు పోస్ట్ చేసిన ఫొటోనే. కేఎల్ రాహుల్‌, అతియాలతో కలిసి ఉన్న ఫొటోను తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆకాంక్ష “ఆ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను” అంటూ కామెంట్ పోస్టు చేసింది.

దీంతో ఆతియా, కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్నారంటూ ఈ మేరకు ఓ బాలీవుడ్‌ సైట్‌ కథనం ప్రచురించింది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని మహిళలపై నోరు జారి… టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చిక్కుల్లో పడ్డారు. దీంతో సీఓఏ నిరవధికంగా వీరిన సస్పెండ్ చేసింది. అప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌తో పాటు ఇప్పుడు జరుగుతున్న న్యూజిలాండ్ టూర్‌కి కూడా వాళ్లు దూరమయ్యారు. తమ వ్యాఖ్యలపై ఇద్దరూ సారీ చెప్పడంతో సస్పెన్షన్ ఎత్తి వేశారు.