జగన్ బాగోతం బయటపెట్టిన కెటిఆర్… ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి?

ఏపీ సిఎం చంద్రబాబుకు తాము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కెసిఆర్ చెప్పినప్పటి నుంచి… ఏపీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కచ్ఛితంగా కలగజేసుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేరుగా బరిలోకి దిగకపోయినా… పరోక్షంగా ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఏదైనా చేయొచ్చనే అనుమానాలు రేకెత్తాయి. అనుకున్నట్టుగానే కొన్ని రోజుల అనంతరం ఊహించని పరిణామాలు చటు చేసుకుంటున్నాయి. వైఎస్ జగన్‌తో చేతులు కలిపి… తెరవెనుక నుంచి సహకారం అందించడం మొదలుపెట్టింది.

ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా జగన్‌తో సంప్రదింపులు జరిపిన టిఆర్ఎస్… అదే సమయంలో ఏపీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. చంద్రబాబును ఎలాగైనా గద్దె దించాలన్న ఉద్దేశంతో… ఇరుపార్టీల మధ్య కొన్ని డీల్స్ కుదిరినట్టు తేలింది. ఇక అప్పటినుంచి టిఆర్ఎస్ రిటర్న్ గిఫ్ట్ వ్యవహారంలో జగన్ హస్తం కూడా ఉందనేది ఓపెన్ అయ్యింది. కానీ… ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచేందుకు అటు టిఆర్ఎస్, ఇటు వైసిపిలు మాటలు మారుస్తూ వస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ తప్ప తమ మధ్య మరే ఒప్పందాలు లేవని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ… ఆమధ్య ఒక సభలో బాబుకు తామిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో ఎన్నికల తర్వాత తెలుస్తుందని చెప్పి బాంబ్ పేల్చారు. అంటే.. జగన్‌కు తమ మద్దతు ఉందని పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు.

ఇప్పుడు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలే చేసి… తమ రహస్య పొత్తు నిజమేననడానికి మరింత బలం చేకూర్చారు కెటిఆర్! వైసిపి అధ్యక్షుడు జగన్‌ తమ ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమేనని… ఆయనది ఇందులో కీలకపాత్ర ఉంటుందని వెల్లడించారు. ఫెడరల్ ఫ్రంట్‌లో కీ-రోల్ ఉంటుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారంటే… ఏపీ ఎన్నికల్లో ఆయనకు పరోక్ష మద్దతు కచ్ఛితంగా ఉంటే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెటిఆర్ తన ప్రసంగాల్లో పదేపదే జగన్ పేరు తీసుకురావడం… వారి పొత్తుకు ప్రత్యక్ష సంకేతాలేనని చెప్తున్నారు.