బిగ్ బాస్ 3 విజేతపై కౌశల్ షాకింగ్ రియాక్షన్

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 విజేత శివ బాలాజీ కాగా రెండవ సీజన్‌ విజేత కౌశల్‌.మొదటి విజేత కంటే రెండవ విజేత అయిన కౌశల్‌కు బాగా పాపులారిటీ దక్కింది.కౌశల్‌ ఆర్మీ అంటూ సోషల్‌ మీడియాలో గత ఏడాది చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.మూడు నాల్గవ వారంలోనే కౌశల్‌ ఆర్మీ ఏర్పాటు అయ్యి మెల్ల మెల్లగా అది కౌశల్‌ను విజేతగా నిలబెట్టింది…కౌశల్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విజేతగా నిలిచిన తర్వాత చాలా బిజీ అయ్యాడు.మంచి పాపులారిటీ దక్కించుకోవడంతో పాటు, మంచి అవకాశాలు కూడా రాబట్టుకుంటున్నాడు.తాజాగా ఈయన సీజన్‌ 3 గురించి తనదైన శైలిలో స్పందించాడు.

దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించడం లేదు.వారు ఎప్పుడైతే నటన మానేసి నిజంగా ప్రవర్తించడం మొదలు పెడతారో అప్పుడు అసలైన గేమ్‌ ప్రారంభం అవుతుందని కౌశల్‌ అన్నాడు.ఇక ఈ సీజన్‌ లో విజేత ఎవరు అనే విషయంపై కౌశల్‌ స్పందించేందుకు నిరాకరించాడు..