మళ్ళీ సీరియల్స్ లోకి రీఎంట్రీ ఇస్తున్న కౌషల్.. అసలు కారణం ఇదేనా..?

ప్రముఖ బుల్లితెర నటుడు కౌశల్ మండకు ఓ మంచి హీరోకు ఉన్నంత పాపులారిటీ లభించింది. బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ ఇప్పుడు మళ్లీ సీరయల్స్‌లో రావడం మొదలు పెట్టాడు. బిగ్ బాస్‌కి ముందు కూడా కౌశల్ సీరియల్స్‌లో పాత్ర పోషించేవాడు. కానీ బిగ్ బాస్‌లో అవకాశం రావడంతో సీరియల్స్‌కి గుడ్ బై చెప్పేసాడు. ఇప్పుడు ఆ సెలబ్రిటీ రియాల్టీ షోలో విన్నర్ నిలిచినా కూడా ఆయన మళ్లీ సీరియల్స్‌లోనే నటిస్తున్నారు. ‘సూర్యవంశం’ అనే సీరియల్‌లో ఆది శంకర్ అనే పాత్రలో నటించేవారు. ఇప్పుడు ఆ పాత్రను మళ్లీ కొనసాగించాలి అని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ‘ఆదిశంకర్ మళ్లీ మీ ముందు వచ్చేశాడు. ఇక మీరు నన్ను రోజూ మిస్ అవ్వరు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ కూడా చేయడం జరిగింది.ఇక ఈ ఫొటోపై ఓ నెటిజన్ కామెంట్ చేయడం జరిగింది. ‘బిగ్ బాస్ కోసం సీరియల్స్ వదులుకున్నావ్. సినిమాల అవకాశాలు లేక మళ్లీ సీరియల్స్‌లోకే వచ్చావ్. ఆల్ ది బెస్ట్’ అని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టాడు.

ఇందుకు కౌశల్ తనదైన శైలిలో రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ‘నటనలో చిన్న పెద్ద అనే తేడా ఏమీ ఉండదు. మనల్ని ప్రేమించేవారు మనల్ని రోజూ చూడగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యం’ కౌశల్ కట్టిగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ రిప్లైతో కౌశల్ మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు అంటే నమ్మండి. చాలా బాగా చెప్పావ్ కౌశల్ అన్నా అంటూ నెటిజన్లు కౌశల్ ను మేచ్చుకున్నారు. గతంలో బిగ్ బాస్‌లో పాల్గొన్నప్పుడు ‘కౌశల్ ఆర్మీ’ పేరిట ఓ సోషల్ మీడియా ఎకౌంట్‌ను కూడా నడిపారు.ఆయన గెలవాలని పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేయడం జరిగింది. కౌశల్‌ని విన్నర్ చేయకపోతే బిగ్ బాస్ హౌస్‌కు నిప్పుపెడతామని కూడా బెదిరించినట్లు వార్తలు కూడా వినిపించాయి అప్పటిలో. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3 దిగ్విజయంగా ముగిసింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ సీజన్‌లో ప్రముఖ ర్యాపర్ రాహుల్ సిప్లిగంట్ విన్నర్‌గా నిలిచాడు. ప్రముఖ యాంకర్ శ్రీముఖి రన్నరప్‌‌గా నీలాచడం జరిగింది. ఈ షోకు కింగ్ నాగార్జున హోస్ట్ చేశారు. ఫైనల్ ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చారు. రాహుల్‌కు తన చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని అందుకోవడం జరిగింది.