కొడుకు కోసం భారీ స్కెచ్.. రాఘవేంద్ర రావు ఏం చేస్తున్నాడో చూడండి

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వారసుల హంగామా కొనసాగుతూ వస్తోంది. స్టార్ హీరోలు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతల వారసులు సినీ రంగంలో అడుగు పెట్టి టాలెంట్ చూపిస్తూ వస్తున్నారు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా నాగార్జున, వెంకటేష్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే కోవలో తన కుమారుడికి కూడా సినీ రంగంలో మంచి పాపులారిటీ తీసుకురావాలని పయత్నాలు చేస్తున్నారట దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.

తెలుగు సినీ పరిశ్రమలో రాఘవేంద్ర రావుది సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి నేటి దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నారాయన. కాగా.. దర్శకత్వ శాఖలో అపార అనుభవం గడించి, టాలీవుడ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన వారసుడు ప్రకాష్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచింది. ‘నీతో’ అనే సినిమాతో తెరకు హీరోగా పరిచయమైన ప్రకాష్ పెద్దగా స్పందన రాబట్టలేక పోయాడు. దీంతో హీరోగా మరో సినిమా చేయలేదు ప్రకాష్. ఆ తర్వాత ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది కూడా నిరాశే మిగిల్చింది. ఆ వెంటనే అనుష్కతో ‘సైజ్ జీరో’ రూపొందించినా సరైన ఫలితం లేదు.దీంతో కొడుకు కెరీర్ ఎలాగైనా గాడిలో పెట్టాలని భావించిన రాఘవేంద్ర రావు భారీ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఈ మేరకు నాగ శౌర్య హీరోగా మూడు ప్రేమ కథలు ముగ్గురు దర్శకులు కాన్సెప్ట్ లో కొడుకు ప్రకాష్ ని భాగం చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకేంద్రుడు.

ఇందులో ఒక పార్ట్ క్రిష్ టేకప్ చేయగా, రెండో పార్ట్ ప్రకాష్ తీసేలా చర్యలు తీసుకుంటున్నాడట రాఘవేంద్ర రావు. ఇక మూడో దర్శకుడు ఎవరనేది తెలియరాలేదు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో ప్రకాష్ అద్వర్యంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయని సమాచారం. చూడాలి మరి తండ్రి సహకారంతో అయినా ప్రకాష్ టాలెంట్ బయటకొస్తుందా? లేదా? అనేది.