కియరా టాలివుడ్ ఏంట్రీ…ఎప్పుడంటే…?

టాలీవుడ్ లో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించిన భామ కియారా అద్వానీ . ఈమె తన నాభి అందాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీ వైపు చూడనే చూడలేదు ఎందుకని అభిమాన సంఘాలు అడిగితే అది ఏమిలేదు రెమ్యూనరేషన్ నాకు పెద్ద సమస్య కాదు నచ్చిన కథ దొరికితే తెలుగులో మల్లి రీఎంట్రీ ఇస్తానండి. తెలుగులో కియారా అద్వానీ రీ ఎంట్రీ ఎప్పుడా అనే అంశంపై సస్పెన్స్‌కు తెర పడింది. త్వరలోనే తాను మళ్లీ తెలుగులో ఓ పెద్ద సినిమాలో నటించబోతున్నానని ఈ హాట్ బ్యూటీ కియారా క్లారిటీ ఇచ్చింది.

అయితే ఆ పెద్ద సినిమా ఏంటనే దాని గురించి మాత్రం చెప్పలేదు ఈ హాట్ ముద్దుగుమ్మ. అయితే మహేశ్ బాబు క్రొత్త సినిమాలో నటించేందుకే కియారా కమిటైందనే టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉంటె ఈ అమ్మడు తన చిన్ననాటి జ్ఞపకాలను నెమరు వేసుకొనే పనిలో పడింది. 1996 లో తనకు ఇష్టమైన ఓ సిండ్రెల్లా కప్ తో తాను వాటర్ తాగుతూ ఆ వీడియో లో కనిపించింది …ఇప్పుడు తన చిన్ననాటి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన చిన్ననాటి స్మృతులను గుర్తు కు తెచ్చుకుంది. రెండు రోజుల క్రితం తన సోదరుడి ఫోటోలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేసి సోదరుడి కి విషెస్ చెప్పి సర్ప్రైస్ చేసింది. ప్రస్తుతానికి తానూ ‘బూల్ భూలయ్య 2 ‘ లోను మరియు గిల్టీ లలో నటిస్తున్నట్లు తెలియజేసింది … ….