ప్రభాస్ తో రోమాన్స్ కు సిధ్ధం అయిన హాట్ బ్యూటీ

ప్రతిష్టాత్మక చిత్రం అయిన బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు సాహో సినిమాతో వచ్చాడు. కానీ సాహో సినిమాకి అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించే లేకపోయింది. ఇక ప్రభాస్ ఆ సినిమా తర్వాత జిల్ ఫేమ్ ‘రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ డియర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయం ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. ఇక మహానటి సినిమా వంటి సూపర్ హిట్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయాలనుకున్నాడు.

ఇక ఈ సినిమాలో ఎవరిని హీరోయినుగా తీసుకోవాలన్నది చిత్ర యూనిట్ లో చర్చ కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది.ఇక నాగ అశ్విన్, ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాని రుపుదిద్దుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాని అన్ని ప్రధాన భాషలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అలాగే సినిమాలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్ హీరో లను కూడా ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే… ఈ సినిమాకి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలావరకు ఈ సినిమాకి ఈమె హీరోయిన్ అని కన్ఫామ్ కూడా చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉండడంతో ఎటువంటి ప్రచారాలు లేవు. అయితే ఒకసారి లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత చిత్ర యూనిట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో.. 50 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్, కైరా జంట బాగుంటుందని, అంతేకాకుండా సాహో తర్వాత ప్రభాస్ కు ఈ సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుందని సినీ ప్రముఖులు వెల్లడిస్తున్నారు.