ఎవరికి చిక్కని కియారా.. ఎందుకంత డిమాండ్

‘వినయ విధేయ రామ’లో రామ్‌ చరణ్‌తో రొమాన్స్‌ చేసిన కియారా అద్వానీ బాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్‌ డిమాండ్‌ వున్న హీరోయిన్‌ అయిపోయింది. కబీర్‌ సింగ్‌ బ్లాక్‌బస్టర్‌ అవడంతో కుర్రాళ్లలో ఆమెకి ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. దీంతో బాలీవుడ్‌ నిర్మాతలు తన కోసం క్యూ కడుతున్నారు.దీపిక, కత్రినా, ప్రియాంక తదితర టాప్‌ హీరోయిన్లు అవుట్‌ డేటెడ్‌ అయిపోవడంతో కియారా అద్వానీ ఇప్పుడు భారీ చిత్రాలని ఆకర్షిస్తోంది. ఒకేసారి నాలుగు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. కరణ్‌ జోహార్‌ బ్యానర్‌లో అక్షయ్‌ కుమార్‌తో ‘గుడ్‌ న్యూస్‌’, సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘షేర్షా’ చిత్రం చేస్తోంది. అక్షయ్‌ కుమార్‌తోనే కాంచన రీమేక్‌ అయిన ‘లక్ష్మీ బాంబ్‌’ కూడా ఆమె సొంతం చేసుకుంది.

‘ఇందు కీ జవానీ’ అనే మరో చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషించనుంది. అటు బోల్డ్‌ పాత్రలు చేయడానికి అరమరికలు లేకపోవడం, ఇటు చూడ్డానికి క్యూట్‌గా వుండడం, అలాగే కాంటెంపరరీ చిత్రాలకి అవసరమైన ముద్దులు, బికినీలకి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో కియారా అద్వానీ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.దీంతో కియారాని తిరిగి దక్షిణాదికి తీసుకురావాలనే ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ చిత్రంలో నటించడానికి ఎంత భారీ పారితోషికం ఆఫర్‌ చేసినా కానీ ఇప్పుడున్న బిజీలో డేట్స్‌ ఇవ్వలేనని తిరస్కరించేసింది.