షాకింగ్ న్యూస్.. కియారా ప్రెగ్నెంట్.. నెట్టింట్లో వైరల్

అవునా అని ఆశ్చర్య పోతున్నారా..నిజమే కాకపోతే ఇది కేవలం వెండితెరపై మాత్రమే..తెలుగులో భరత్ అనే నేను , వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు..బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారింది. అమ్మడి తో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శక , నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రానప్పటికీ..బి టౌన్ లో మాత్రం బిజీ బిజీ గా ఉంది.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటిస్తున్న గుడ్ న్యూస్ చిత్రంలో గర్భవతి పాత్రలో ఈమె కనిపించబోతుంది.కృత్రిమ పద్దతిలో గర్భం దాల్చే యువతులుగా కియారా అద్వానీ, కరీనా కపూర్ నటించనున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో గర్భవతులుగా ఉన్న కియారా, కరీనా మధ్యలో కన్ఫ్యుజ్ అవుతున్న అక్షయ్ లుక్ ఆసక్తికరంగా ఉంది. రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ధర్మ ప్రొడక్షన్స్, కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. క్రిస్మస్ కానుకగా వచ్చే నెల 27న ఈ మూవీ విడుదల కానుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.