కేజీఎఫ్ రేంజ్ లో ఉహించుకున్నారా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాతో ఒకప్పుడు ప్రేమలో పడి ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టి. రష్మిక ఫియాన్సీగానే అతను ఎక్కువగా మీడియాలో హైలైట్ అయ్యాడు. వీళ్లిద్దరూ విడిపోయాక రష్మిక మాజీ లవర్‌గా అతను అప్పుడప్పుడూ చర్చల్లోకి వచ్చేవాడు. ఐతే ఈ మధ్య ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే సినిమా ట్రైలర్‌తో అతను తెలుగు ప్రేక్షకులకు పెద్ద షాకిచ్చాడు. ముందు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినపుడు అవసరమా ఇదంతా అని కామెంట్లు చేశారు. కానీ నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఆ సినిమా ట్రైలర్ చూశాక అభిప్రాయాలు మారాయి. ‘కేజీఎఫ్’ తరహాలో ఇది కూడా ప్రత్యేకమైన సినిమాలాగే కనిపించింది. సినిమాకు కొంచెం బజ్ ఏర్పడింది. ఐతే ఆ బజ్‌ను పెంచుతూ.. రిలీజ్ ముంగిట సినిమాకు క్రేజ్ పెంచడంలో చిత్ర బృందం విఫలమైంది.

మన ప్రేక్షకుల దృష్టంతా క్రిస్మస్ సినిమాల మీదే ఉండగా.. ‘అతడే శ్రీమన్నారాయణ’కు ప్రమోషన్లు గట్టిగా చేయడంలో చిత్ర బృందం విఫలమైంది. ఈ సినిమాను హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా బజ్ అంతంతమాత్రంగానే ఉంది. ఈ బుధవారం నూతన సంవత్సర కానుకగా ‘అతడే శ్రీమన్నారాయణ’ రిలీజవుతున్నట్లు కూడా జనాలకు పెద్దగా తెలియదు. కన్నడలో మాత్రం బజ్ బాగానే ఉన్నట్లుంది. గత ఏడాది ‘కేజీఎఫ్’ రిలీజ్ ముంగిట పరిస్థితి ఇలా లేదు. హైప్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ‘అతడే శ్రీమన్నారాయణ’కు కేటాయించిన థియేటర్ల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. బుకింగ్స్ కూడా పెద్దగా లేవు. దీన్ని బట్టే బజ్ పెద్దగా లేదని అర్థమవుతోంది. మరి సినిమా చాలా బాగుండి, పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే పరిస్థితి మారుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకులు ‘ప్రతి రోజూ పండగే’, ‘మత్తువదలరా’ సినిమాల మాయలోనే ఉన్నారు. ఈ వారం వర్మ గారి ‘బ్యూటిఫుల్’తో పాటు మరో డబ్బింగ్ మూవీ ‘తూటా’.. ఇంకా ‘ఊలాలా ఊలాలా’, ‘హల్‌చల్’ సినిమాలు కూడా రిలీజవుతున్నాయి కానీ.. ఏదీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా లేవు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.